ఆయన పేరు పీలా గోవింద సత్యనారాయణ. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిముషంలో సీటు పట్టేసిన ఆయన అనూహ్యంగా గెలిచారు. ఇపుడు మాత్రం అక్కడ సీన్ రివర్స్ అవుతోందంటున్నారు. ఎమ్మెల్యే పనితీరు జనంలో అసంతృప్తిని కలిగించడమే కాకుండా అభివృధ్ధి కూడా మచ్చుకైనా లేకపవడం పట్ల జనల్లో వ్యతిరేకత ఉందంటున్నారు.ఆయన పేరు భూ కబ్జాలో ఉండడంతో ఇమేజ్ డ్యామేజ్ అయింది. గత ఏడాది ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) ఏకంగా అధికార పార్టీకి చెందిన పీలా గోవిందుకు నోటీసుకు పంపించడం సంచలనం రేకెత్తించింది. ఆయన భూ కబ్జాలపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని కూడా సిట్ పేర్కోవడం విశేషం. ఇక తాజాగా మావోల హిట్ జాబితాలోనూ ఆయన ఉన్నారు. ఇక ఆయనకు సహకరించిన వర్గాలు ఒక్కొక్కటిగా ఇపుడు విడిపోతూ వస్తున్నాయి.అనకాపల్లిలో తుంపాల దగ్గర చక్కెర కర్మాగారం ఉంది. దాని నష్టాల నుంచి బయట పడేసి నిధులు తెస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఆ హామీని నెరవేర్చుకోలేకపోయారు. చివరికి ఎన్నో ఆందోళను, బందులు నిర్వహించాక ఎట్టకేలకు నిధులు విడుదలైనా ఎమ్మెల్యేను మాత్రం కార్మికులు తప్పుపడుతూనే ఉన్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైనస్ అవుతుందని అంటున్నారు.టీడీపీలో స్థానికంగా ఎంతోమంది నాయకులు ఉన్నా పెందుర్తి నుంచి ఏరి కోరి తెచ్చి పీలాకు టికెట్ ఇవ్వడం పట్ల స్థానికంగా కొంతమంది గుస్సా అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి మార్చాలని వారు ఎదురుచూస్తున్నారు. వీలుంటే లోకల్ గా ఉన్న వారిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కూడా లాబీయింగ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, ప్రజలకు దూరంగా ఉండడం, చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం వంటి కారణాలతో పీలాకు టికెట్ ఇచ్చినా గెలవరని కూడా పార్టీలోని తమ్ముళ్ళే ప్రచారం చేస్తున్నారు. అయినా పీలా మరో మారు తనకే టికెట్ వస్తుందని, తానే మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని ధీమాగా చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.