YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడు నెలలలుగా గ్రావెల్‌ దందా

  మూడు నెలలలుగా గ్రావెల్‌ దందా
నెల్లూరు–కావలి మధ్య మూడో రైలు మార్గం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కోట్లాది క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ అవసరమైంది. జిల్లాలో జిగురు మోతాదు ఎక్కువ పాళ్లలో ఉండి, గట్టితనంతో సులువుగా నేలపై ఇమిడిపోయే రకం గ్రావెల్‌ మట్టి కావలి నియోజకవర్గంలో చాలా చోట్ల అందుబాటులో ఉంది. సదరు పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఈ పరిసరాల్లో గ్రావెల్‌ మట్టిని పరిశీలించాయి. చట్టంలో ఉన్న లొసుగులును అడ్డం పెట్టుకుని నాయకులు గ్రావెల్‌ రవాణాకు మొక్కుబడి అనుమతులు సంపాదిస్తున్నారు. ఒక క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌కు ఇరిగేషన్‌ శాఖ ఒక్క రూపాయి, గనుల శాఖకు రూ.30 వంతున చలానా రూపంలో చెల్లిస్తారు. ఒక్కో చెరువులో 10 వేలు క్యూబిక్‌ మీటర్లు గ్రావెల్‌ తరలింపునకు చలానాలు చెల్లిస్తున్నారు. అంటే నామ మాత్రపు ఫీజులు చెల్లించి ఒక్కో చెరువు నుంచి 900 టిప్పర్లు గ్రావెల్‌ తవ్వుకుని తరలించుకోవడానికి అనుమతులు పొందుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా తరలింపు మాత్రం జాతరలా జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు వేల టిప్పులు టిప్పర్లలో గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఒక్కో చెరువులో నెల రోజుల్లో 3 వేల ట్రిప్పులకు పైగా గ్రావెల్‌ను తరలించినట్లు సమాచారం. చెరువుల్లో గ్రావెల్‌ తవ్వకాలకు టీడీపీ నాయకులు పొందిన  అనుమతుల ప్రకారం నిబంధనలు అనుసరిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఇరిగేషన్‌ అధికారుల కాని, గనులశాఖ అధికారులు కాని అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక నిత్యం రోడ్డు మీద వెళ్లే ఇసుక, గ్రావెల్‌ ట్రాక్టర్లను పట్టుకుని కేసులు రాసే పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం సదరు నేతకు సంబంధించిన భారీ టిప్పర్లను కూడా చూసీ చూడనట్లు వదలేస్తున్నారుఈ మట్టిని రవాణా చేసేందుకు దళారుల ద్వారా అధికార పార్టీలో కీలక నేతను సంప్రదించారు. ఏ ప్రాంతాల్లోని చెరువుల్లో గ్రావెల్‌ మట్టి కావాలో స్పష్టత ఇచ్చారు. రూ.కోట్ల చేతులు మారడంతో రంగంలోకి దిగిన సదరు నేత తన అధికారంతోఅధికారుల పరంగా అవసరమైన అనుమతులను తీసుకున్నారు. తన అనుచరగణాన్ని దించేసి ఒక్కొక్కరికి ఒక్కో చెరువును అప్పగించి గ్రావెల్‌ రవాణా చేసే బాధ్యతను అప్పగించారు.  నియోజకవర్గంలో కావలిరూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మొత్తం 83 చెరువులు ఉన్నాయి. వీటిలో కావలి పట్టణంలోని మద్దూరుపాడు, మండలంలోని రుద్రకోట, బోగోలు మండలంలోని కోవూరుపల్లి, కడనూతల, పాత బిట్రగుంట, బోగోలు, దగదర్తి మండలంలోని సున్నపుబట్టి, అల్లూరు మండలం నార్తు ఆములూరు, గ్రద్దగుంట, బిట్రకాగొల్లు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. నేల చదరంగా మైదానంలా ఉన్న చెరువులను గుల్ల చేస్తున్నారు. భారీ ప్రొక్లెయిన్లు, పదులు సంఖ్యలో టిప్పర్లు పెట్టి ఇప్పటికే బోగోలు మండలంలోని కోవూరుపల్లి, కావలి మండలంలోని మద్దూరుపాడు, రుద్రకోట చెరువులను కుళ్లబొడి చేశారు. తాజాగా బోగోలు మండలంలోని కడనూతల చెరువుపై పడ్డారు. నిత్యం వందలాది టిప్పర్లు గ్రావెల్‌ రాకపోకలు సాగిస్తుండటంతో ఆ ప్రాంత గ్రామాలన్నీ కూడా మట్టికొట్టుకుపోతున్నాయి. అల్లూరు మండలం సౌత్‌ ఆమలూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా ఈ గ్రావెల్‌ దందా మూడు నెలలలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. 

Related Posts