YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాహూల్ తో టీపీసీసీ మరిన్ని సభలు

రాహూల్ తో టీపీసీసీ మరిన్ని సభలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్పటి యూపీఏ ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని భావించింది. అయితే, ఆ క్రెడిట్ అంతా తమ వైపు తిప్పుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని ఎగరేసుకుని పోయింది. దీంతో హస్తం పార్టీ ప్రతిపక్షా పాత్రతో సరిపెట్టుకుంది. అందుకే ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పుడు ప్రభావం చూపలేకపోయినా.. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఇప్పుడు విజయం సాధించాలని భావిస్తోంది. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ అధిష్ఠానం. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. పొత్తు కన్ఫార్మ్ అయినా.. సీట్ల సర్ధుబాటు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు, ఈ పార్టీలకు చెందిన నేతలు పలానా సీటు తనకే దక్కుతుందని ఇప్పటి నుంచే ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల పంపకం విషయంలో మిగిలిన పార్టీలు కాంగ్రెస్ పార్టీపై కొంత అసహనంగా ఉన్నాయి. అందుకే ముందు ఈ విషయంపై తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ కారణంగా టీకాంగ్రెస్ నేతల్లో కొంత భయం మొదలైందట.మహాకూటమి ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్.. సీట్ల పంపకం విషయంలో ఏటూ తేల్చకపోవడంతో మిత్ర పక్షాలు మరోదారి చూసుకుంటాయేమోనన్న భయం అక్కడి నేతల్లో కనిపిస్తోందని అనుకున్నారంతా. ఎలాగో రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారు కాబట్టి ఆయన టూర్‌లో దీనిపై స్పష్టత వస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అనుకున్నట్లుగానే రాహుల్ తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటన తర్వాత కాంగ్రెస్‌లో భయం పోయి ధీమా పెరిగిపోయిందట. దీనికి కారణం రాహుల్ టూర్ సక్సెస్ కావడమేనని తెలుస్తోంది. తెలంగాణలో రాహుల్‌గాంధీ తొలి ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక్కడి కాంగ్రెస్ నేతలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి నియోజకవర్గాలను సెలెక్ట్ చేయడం సభ సక్సెస్ అవడానికి కారణం అయింది. రాహుల్ కూడా ఈ సారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులను టార్గెట్ చేసి ప్రసంగించడం కూడా కొంత కలిసొచ్చిందనే చెప్పవచ్చు.
 ఇవన్నీ పక్కన పెడితే, రాహుల్ సభకు వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ నేతల్లో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమనే ధీమా పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మరి, ఈ సక్సెస్‌ను ఆ నేతలు ఎలా మలచుకుంటారో చూడాలి.

Related Posts