ఆంధ్రప్రదేశ్ నాలుగున్నర ఏళ్ల వయస్సు ఉన్న స్టార్ట్ అప్ రాష్ట్రం. స్టార్ట్ అప్ కంపెనీలు ఎలా సంక్షోభాలను ఎదుర్కుంటాయో అలానే మేము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుగుతున్నాం. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ అభివృద్ధి సాధిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. మంగళవారం అయన ఫిన్ టెక్ 2.0 సదస్సులో పలు ఐటీ కంపెనీల అధినేతలు, సీఈవోలను ఉద్దేశించి ప్రసంగించారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. లక్ష్యం నిర్దేశించుకున్న తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న అధునాతన టెక్నాలజీల పై దృష్టి పెట్టామనిఅన్నార. 4 వ పారిశ్రామిక విప్లవం లో వస్తున్న అధునాతన టెక్నాలజీలు అమలు చెయ్యడంలో అందరి కంటే ముందు ఉన్నాం. ఫింటెక్,బ్లాక్ చైన్,డేటా అనలిటిక్స్ లాంటి టెక్నాలజీలను అభివృద్ధి చేస్తూ...ఆయా రంగాల్లో రాష్ట్ర యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. అధునాతన టెక్నాలజీ,ఫింటెక్ రావడంతో సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందని అన్నారు. నూతన రాజధాని అమరావతిలో ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేస్తున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం ద్వారా ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరగకుండా రక్షణ కల్పిస్తున్నాం. రైతులకు క్రెడిట్ స్కోర్ ఇవ్వడం ద్వారా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా పంట భీమా,రుణాలు పొందే అవకాశం ఉంటుంది. డ్రోన్స్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాం. న్లు వినియోగించి రియల్ టైం లో భూ పరీక్షలు నిర్వహించే టెక్నాలజీ పై మేలిండా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. డ్రోన్లకు లైడార్ టెక్నాలజీ అనుసంధానం చెయ్యడం ద్వారా రహదారుల నాణ్యత తెలుసుకునే పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించామని అన్నారు. సమాచారం ఆధారంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. 10 లక్షల ఐఓటి పరికరాలు వినియోగించి రియల్ టైం లో నీటి నాణ్యత,భూగర్భ జలాలు,వాతావరణం ఇలా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రజా సాధికార సర్వే ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా రియల్ టైంలో జనాభా లెక్కలు వేస్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.