ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ సర్కార్ ఇచ్చిన జీవోని కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. . సర్పంచుల పదవీ కాలం ఆగస్ట్లోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా దిగువ కేడర్ ఉద్యోగులను నియమించడాన్ని మాజీ సర్పంచులు హైకోర్టులో సవాల్ చేశారు. అధికారుల ద్వారా పాలన నిర్వహించడం అన్నది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. వెంటనే ఈ జీవోను కొట్టివేసి, ఎన్నికలు నిర్వహించాలని కోర్టును కోరారు. పిటీషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రత్యేకాధికారుల ద్వారా పూర్తి చేయాలని సూచించింది.