YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దేశంలోనే తొలిసారి పెంపుడు జంతువులకూ పార్క

దేశంలోనే తొలిసారి పెంపుడు జంతువులకూ పార్క

-  రూ.69.85లక్షలతో  పెట్‌ పార్కు

- హైదరాబాద్ లో  సాగుతున్న పనులు 

పెట్‌ పార్కులు విదేశాల్లో మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణహించింది. పెంపుడు జంతువులకు ఆహ్లాదకరంగా, అనుకూలంగా అన్ని హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత  త్వరగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి జరుగుతుంది.
 పెంపుడు కుక్కలపై ఉండే మమకారం అది పెంచేవారికే తెలుస్తుంది.. వాటితో అంతటి అప్యాయత మిళితమై ఉంటుంది. తమ పిల్లల్లా వాటికి ప్రాధాన్యమిచ్చి బాగోగులు చూసుకుంటారు. చాలా శునకాల యజమానులు ఉదయం, సాయంత్రం వేళ వాటిని బయటకి తీసుకొచ్చి వాకింగ్‌ చేయిస్తుంటారు. ఇలాంటి వారికోసమే విదేశాల్లో పెట్‌ పార్కులు కూడా అందుబాటులో ఉంటాయి. పెంపుడు జంతువులను ఆయా పార్కులకి తీసుకెళ్లి ఆహ్లాదాన్ని అందించవచ్చు. హైదరాబాద్ లో సైతం అలాంటి పెట్‌ పార్కు ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచన అధికారులకు వచ్చింది. అనుకున్నదే తడవుగా ప్రభుత్వ అనుమతి పొంది కార్యాచరణకు ఉపక్రమించారు. బల్దియా పశ్చిమమండలం జోన్‌ కమిషనర్‌ హరిచందన ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని గచ్చిబౌలి హౌసింగ్‌ బోర్డుకాలనీలోని ఎకరంన్నర స్థలంలో ఈ పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. నిధులు కూడా మంజూరుకావంతో సంబంధిత పనులను కూడా ఆరంభించారు. దీని నిర్మాణం పూర్తయితే దేశంలోనే మొదటిసారిగా కుక్కలు, పెంపుడు జంతువుల కోసం పార్కు ఏర్పాటుచేసిన ఘనత నగరానికి దక్కుతుంది.
ఇలా ఉండబోతోంది.. 


* ఈ పార్కు ఏర్పాటు అంశంపై పశ్చిమమండలం జోన్‌ కమిషనర్‌ హరిచందన శ్రద్ధ వహించి ప్రత్యేకంగా ఆర్కిటెక్టులను ఏర్పాటు చేశారు. వారివారి అధ్యయనాలతో అన్ని హంగులుండేలా నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న నమూనాలు తెప్పించి వాటి విశేషాలను పరిశీలించి ప్లాన్‌ తయారుచేశారు. పెద్ద కుక్కలు, చిన్న కుక్కలు కలిస్తే కరుచుకునే ప్రమాదం నేపథ్యంలో వేరువేరుగా గదులు, ఆటవస్తువులు ఏర్పాటు, ఇతర వస్తువులు, వాటి ప్రదేశాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రత్యేకలతో ఈ పార్కును ఏర్పాటుచేయనున్నారు. 
* పార్కులోకి ప్రవేశించే ఎంట్రన్స్‌ ప్లాజా, కుక్కల కోసం ప్రత్యేకంగా ఆల్జీబ్రా ర్యాంప్‌, అవి ఆహ్లాదంగా నీళ్లల్లో, బయట ఇసుకలో ఆడుకున్న తరువాత మళ్లీ శుభ్రంగా కూల్‌వాష్‌ వాటర్‌ బాడీ ప్రాంతాలను చిన్న కుక్కలు, పెద్దకుక్కలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ట్రైనింగ్‌ ఏరియా, ఆటవస్తువులు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా ఒక ట్రైనర్‌ని కూడా ఏర్పాటు చేస్తారు. కుక్కలకి వ్యాక్సినేషన్‌ ప్రధానం కాబట్టి ఒక వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉంటారు. కుక్క కాటుకి తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా ఇక్కడి వైద్యులు వివరిస్తారు. వాటికి అవసరమైన ఆహారం అందుబాటులో ఉంచనున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, ఇతరులకు ఒక కేఫ్‌ కూడా ఏర్పాటు చేస్తారు.

పిల్లులకూ.. 
పెంపుడు పిల్లుల కోసం కూడా ఈ పార్కులో కొంత భాగాన్ని అందించనున్నారు. వీటికి సంబంధించిన ఆటవస్తువులు, ఆడుకునే ప్రాంతాన్ని ఏర్పాటుచేయనున్నారు. వీటికి సంబంధించిన ఆహారమూ అందుబాటులో ఉంచుతారు. పిల్లులు పెంపకందారులు వినియెగించుకునే దాన్ని బట్టి మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో రూ.69.85లక్షలతో నిర్మాణాలు, జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదంపంచే పచ్చదనం, వాకింగ్‌ ట్రాక్‌ తదితరాలను సిద్ధంచేస్తారు. ఇలా పార్కు మొత్తం ఎకరంనరలో నిర్మాణం చేస్తున్నారు. దీని నిర్వహణ ఖర్చుతో కూడుకుంది కాబట్టి కేబీఆర్‌ పార్కు మాదిరిగా రుసుం ఏర్పాటు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
 

Related Posts