YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

సోంత పార్టీ దిశగా లక్ష్మీనారాయణ

సోంత పార్టీ దిశగా లక్ష్మీనారాయణ
ఏపీలోని 13 జిల్లాలు తిరిగి, సమస్యల పై అధ్యయనం చేసారు. కొన్ని రోజుల క్రితమే అన్ని జిల్లాలు తిరిగి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా కలిసి వస్తే వారితో పనిచేయడానికి సిద్ధమన్నారు. అలాకాని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తన అలోచనలను కార్యాచరణలో పెట్టడానికి కృషి చేస్తానన్నారు.కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నానని తెలిపారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పటికయితే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ తనకు వచ్చిన ఆఫర్లను వెల్లడించారు. ఆ ఆపర్ల పై తటస్థంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున తగిన వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పారు.అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనం, కులం కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్నికలంటేనే ధన వ్యయంతో కూడుకున్న ఒక ప్రక్రియగా మారిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన ప్రచారం కోసం నిర్ధిష్టమైన మొత్తాన్ని వ్యయం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తానికన్నా తక్కువ వ్యయం చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది తన వైఖరి అన్నారు. ఎన్నికల సందర్భంగా 50 శాతం మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మంచి పరిపాలకులను ఎంచుకోవచ్చని అది ప్రజా సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు కావాలన్నది తన ఆలోచన అన్నారు.

Related Posts