YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తితీలీ లెక్కల్లో మతలబు

తితీలీ లెక్కల్లో మతలబు
 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చెట్లన్నీ సహజ సిద్ధంగా పుట్టి, పెరిగనవేనని వాటికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. పోడు పట్టాదారులునూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం ఏజెన్సీలో కలకలం రేపుతోంది. గిరిజనుల్లో తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. జీడిమామిడి, చింత, టేకు వంటి వన సంపద పైనే గిరిజనుల జీవనోపాధి ఆధారపడిఉన్న సంగతి తెలిసిందే. తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, భామిని, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టు తదితర ఏజెన్సీ మండలాల్లో జీడిమామిడి, టేకు, చింత, సరుగుడు, రోజ్‌వుడ్‌, ఏగిస తదితర వృక్షసంపద నేలకొరిగింది. దీంతో వీటిమీదనే ఆధారపడి జీవనం సాగించే గిరిజనుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం నుండి ఎంతోకొంత ఆపన్న హస్తం అందు తుందన్న ఆశాభావంతో ఉన్న వారికి తాజా మార్గదర్శకాలు గంపెడు విషాదాన్ని నింపాయి. తుపాను వెళ్లి పదిరోజులు గడిచిన తరువాత 20వ తేది రాత్రి సాయంపై ఆంక్షలు పెడుతూ ఆటవీ శాఖాధికారులకు మార్గదర్శకాల పేరుతో ఈ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. కొన్ని నెలల క్రితం ఉద్యానశాఖ అధికారులు దీనికి భిన్నంగా ఏజెన్సీలో ప్రచారం చేశారు. పోడు పట్టాలు తీసుకుంటేనే ప్రభుత్వం జీడి చెట్లను గుర్తిస్తుందని వారు పదేపదే చెప్పడంతో గిరిజనులు ఆ పట్టాలు తీసుకున్నారు. కష్టకాలంలో అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. పోడు వ్యవసాయదారులకు ఇలా సున్నా చుట్టిన ప్రభత్వుం జిరాయితీ, డి-పట్టా పరిధిలోని చెట్లకు కూడా నష్టపరిహారం ఎగ్గొట్టాలని చూస్తోంది. 45 సెంటీమీటర్ల చుట్టుకొలత దాటిన చెట్లను అటవీ శాఖాధికారులు గుర్తించడం లేదు. ఇదేమంటే అంతమందంగా ఉన్న చెట్లను యజమానులే టింబర్‌ డిపోలకు విక్రయించుకుని నష్టాన్ని అధిగమించవచ్చని చెబుతున్నారు. అలాగని చిన్నాచితక చెట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పడిపోయిన చెట్లను గుర్తించేందుకు మండలానికి ఐదుగురు చొప్పున సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. సిబ్బంది తక్కువగా ఉండడంతో నష్టగణనకు మరో వారం రోజులు పట్టొచ్చని పాతపట్నం మండలం ప్రత్యేక అధికారి ఎన్‌.సీతామహాలక్ష్మి తెలిపారు. 

Related Posts