ఉత్తమ పాలన అందించే నేతలను ఎన్నుకోవడానికి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరు ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియెగించుకొని తన ఆశలను నెరవేర్చే నేతలను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఓటుహక్కు తప్పనిసరి. ఓటుకు ఇంత ప్రాధాన్యం ఉన్నందున ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసికోని, లేకపోతే అక్టోబర్ 31వ తేదిలోగా తప్పనిసరిగా ధరఖాస్తు చేసుకోవాలి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథó్యంలో తుది ఓటరు జాబితాలను అధికార యంత్రాంగం సిధ్దం చేస్తొంది. నమోదులు, తొలగింపులు, అభ్యంతరాలు, బదిలీకోసం దరఖాస్తు స్వీకరణ చేపట్టనున్నారు. గత నెలలో ప్రారంభమై, ఈ నెల 31వరకు జరిగే ప్రక్రియలో భాగంగా జోన్-4 పరిధిలోని నియోజకవర్గంలో పలుచోట్ల కేంద్రాలను
నియోజక వర్గ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లను జాబితాలో చేర్చేందుకు అధికారులు విసృత ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటికే చాలా మంది అర్హులైన వారికి ఓటు హక్కు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన వారి ఓట్లు బదిలీకాకపోవడం తదితర సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారి లేదా బూత్ లెవల్ అధికారి (బిఎల్‌ఓ) కార్యాలయంలో సంబంధిత దరఖాస్తులను నింపి ఓటు హక్కు పొందవచ్చు. వయస్సు నిర్ధారణ, చిరునామాకు సంబంధించిన రెండు దృవ పత్రాలతో పాటు, రెండు పాస్‌పోర్టు సైజ్ పోటోలు జతపరచాలి.ఆన్‌లైన్ : నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టర్ లాగిన్ అవ్వాలి. అందులో ఓటరుకు సంభందించిన అన్ని వివరాలను నమోదు చేయాలి. వయస్సు, చిరునామా తెలిపే రెండు దృవ పత్రాలతో పాటు, పాస్‌పోర్టు సైజ్ పోటోను ఆప్‌లోడ్ చేయాలి.
నమోదు దరఖాస్తుల వివరాలు :
ఫారం - 6 : నూతన ఓటు దరఖాస్తు
ఫారం - 7 : ఓటు బదిలీకి, ఓటు తొలగింపునకు
ఫారం - 8 : చిరునామా, వేరు, పుట్టిన తేదిల్లో మార్పుల కోసం.
ఫారం - 8 ఎ: నియోజక వర్గ పరిధిలోనే ఓటు బదిలీ కోసం.