YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

హైదరాబాద్ లో ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్లీనరీ..

హైదరాబాద్ లో ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్లీనరీ..

- 11న దారుస్సలాంలో ముగింపు సభ 

- ఏఐఎంపీఎల్‌బీ అధ్యక్షులు మౌలానా సయ్యద్‌ మహమ్మద్‌ రాబే హసనీ నద్వీ,

ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు 26వ ప్లీనరీ నగరంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రి, పరిశోధన సంస్థ మైదానంలోని సాలార్‌ ఏ మిల్లత్‌ ఆడిటోరియం, స్పోర్ట్స్‌ సెంటర్‌లో దీనికి వేదికైంది. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఏఐఎంపీఎల్‌బీ) అధ్యక్షులు మౌలానా సయ్యద్‌ మహమ్మద్‌ రాబే హసనీ నద్వీ, ఉపాధ్యక్షులు మౌలానా కాకా సయీద్‌ అహ్మద్‌, ప్రధాన కార్యదర్శి మౌలానా సయ్యద్‌ మహమ్మద్‌ వలీ రెహ్మనీ, ఏఐఎంపీఎల్‌బీ సభ్యులు, జామియాత్‌ ఉలేమా ఏ హింద్‌ మౌలానా సయ్యద్‌ అర్షద్‌ మదానీ, ఏఐఎంపీఎల్‌బీ కార్యనిర్వాహక సభ్యులు, ఆహ్వాన కమిటీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సమక్షంలో ప్లీనరీ నిర్వహించారు. అనంతరం వర్కింగ్‌ కమిటీ సమావేశమైంది. కోల్‌కతాలో జరిగిన 25వ ప్లీనరీలో తీసుకున్న పలు నిర్ణయాలు, దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షలు నిర్వహించనున్నారు. 10వ తేదీన ఉదయం వార్షిక సమావేశంలో గత నిర్ణయాల నివేదికను ప్రధాన కార్యదర్శి వివరిస్తారు. ప్లీనరీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం జరిగే సమావేంలో ఏఐఎంపీఎల్‌బీ ఆర్థిక స్థితిగతులు, నిధుల సమీకరణలపై విస్తృత స్థాయి చర్చ, అభిప్రాయాల సేకరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉర్దూ భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. ఆదివారం ఉదయం ప్లీనరీలో బాబ్రీమసీదు అంశం, ముమ్మారు తలాక్‌కు సంబంధించిన బిల్లులో మార్పులు, చేర్పులపై చర్చించనున్నారు. 11వ తేదీ సాయంత్రం దారుస్సలాం మైదానంలో లక్ష మందితో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇస్లామియా పండితులు, మేధావులతోపాటు ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు.

Related Posts