ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ -బెంగళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివర్సిటీ- నోయిడాలో ఏడాది వ్యవధితో (2019-20) పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు చదవాల్సి ఉంటుంది. విజయవంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో కెనరా బ్యాంక్‌లో పోస్టింగ్ ఇస్తారు.
* ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1): 800 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-404, ఓబీసీ-216, ఎస్సీ-120, ఎస్టీ-60.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: 01.10.2018 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.708; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.118 (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం..
* మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
* ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.
* పరీక్షలో సెక్షన్లవారీగా కటాఫ్ మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున కోత విధిస్తారు.
కోర్సు స్వరూపం..
* ఎంపికైనవాళ్లు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివర్సిటీ- గ్రేటర్ నోయిడాల్లో ఏదో ఒక చోట ఏడాది వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు చదవాల్సి ఉంటుంది. వసతి, భోజనం, కోర్సు, ఇతర అన్ని రకాల ఫీజులు, జీఎస్టీ కలుపుకుని మణిపాల్‌కు ఎంపికైనవాళ్లు రూ.4,13,000 చెల్లించాలి, ఎన్ఐటీటీఈను ఎంచుకున్నవారు రూ.3,54,000 చెల్లించాలి. వీరికి తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కూడా కల్పిస్తారు. ఉద్యోగంలోకి చేరిన తర్వాత సులభ వాయిదాల ద్వారా చెల్లించుకోవచ్చు.
ఈ ఏడాది వ్యవధిలో 9 నెలల తరగతి శిక్షణ, మూడు నెలలు ఏదైనా కెనరా బ్యాంకు శాఖలో ఇంటర్న్‌షిప్ చేయాలి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి మణిపాల్ యూనివర్సిటీ / ఎన్ఐటీటీఈ పీజీడీబీఎఫ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు కోర్సు పూర్తయిన తర్వాత అయిదేళ్లు ఉద్యోగంలో కొనసాగుతామని ఒప్పంద పత్రం సమర్పించాలి. మధ్యలో వైదొలిగితే రుణంగా తీసుకున్న ఫీజుతోపాటు రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు..
శిక్షణ అనంతరం విధుల్లోకి చేరినవారికి రూ.23,700 మూలవేతనంగా లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏతోపాటు వివిధ ఆలవెన్సులు లభిస్తాయి. రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. అనంతరం శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అయిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఏడాదికి కొంత మొత్తం చొప్పున పదేళ్ల సర్వీసు పూర్తయ్యే వరకు చెల్లించిన ఫీజును బ్యాంకు తిరిగి ఇచ్చేస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.10.2018.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2018.
* ఫీజు చెల్లింపు తేదీలు: 23.10.2018 - 13.11.2018 వరకు
* కాల్ లెటర్ డౌన్‌లోడ్: 05.12.2018 తర్వాత
* ఆన్‌లైన్ పరీక్ష తేది: 23.12.2018
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో; ఏపీలో - చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.