YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

అంతర్జాతీయ సానుకూల పరిణామాలు.. కొనుగోళ్లతో మార్కెట్లకు లాభాలు

అంతర్జాతీయ సానుకూల పరిణామాలు.. కొనుగోళ్లతో మార్కెట్లకు లాభాలు
వరుస నష్టాల తరువాత దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, కొనుగోళ్లు పెరగడంతో ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ప్రారంభించింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 34 వేల పాయింట్ల స్థాయికి ఎగబాకింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభంతో జోరుగా కదలాడింది. ఫైనాన్స్, విద్యుత్, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. అయితే కొద్ది సేపట్లోనే ప్రారంభ లాభాలు డీలా పడ్డాయి. మధ్యాహ్నా సమయానికి ఓ దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో సూచీలు పుంజుకోవడంతో మరోసారి నష్టాల బారిన పడకుండా మార్కెట్లు నిలిచాయి. 
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186.73 పాయింట్లు లాభపడి 34033.96 వద్ద, నిఫ్టీ 79.95 పాయింట్లు లాభపడి 10224.75 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు బలపడి 73.19 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 
బజాజ్ ఫైనాన్స్ (10.97), భారతీ ఎయిర్టెల్ (10.48), హెచ్పీసీఎల్ (6.82), ఐవోసీ (5.81), హిండాల్కో (4.72) షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. మరోవైపు.. యస్ బ్యాంక్ (-4.32), బజాజ్ ఆటో (-4.31), గ్రాసిమ్ (-2.05), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-1.59), అదానీ పోర్ట్స్ (-1.52) అధికంగా నష్టాలను చవిచూశాయి. 

Related Posts