YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ ఏడాదిలో గరిష్ఠం

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు  ఈ ఏడాదిలో గరిష్ఠం
అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వెత్తడంతో బుధవారం (అక్టోబరు 24) కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,500 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,350 గా ఉంది. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.32,500 స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 
మరోవైపు వెండి ధర స్వల్పంగా రూ.20 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.39,730 వద్ద నిలిచింది. 8 గ్రాముల బంగారం ధర రూ.100 రూపాయలు పెరిగి రూ.24,800 స్థిరపడింది. 
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పెరిగాయి. సింగపూర్లో ఔన్సు బంగారం ధర 0.11 మేర పెరిగింది. దీంతో అక్కడ బంగారం ధర 1,232.20 అమెరికన్ డాలర్లుగా ఉంది. 

Related Posts