YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టుటకు కృషి చేయాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునిఠ

 రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టుటకు కృషి చేయాలి    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అనిల్ చంద్ర పునిఠ
దేశ రాజధానిలో కేంద్ర అధికారులు, మంత్రిత్వశాఖలతో సత్సంబంధాలు కలిగి రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టుటకు కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ భవన్ అధికారులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అనిల్ చంద్ర పునిఠ దిశానిర్ధేశం చేశారు. దేశ రాజధానికి విచ్చేసిన ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునిఠ బుధవారం ఢిల్లీ లోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ గురజాడ సమావేశ మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తో కలసి భవన్ అధికారులు, లైజన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఎపి భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంకు  కేంద్ర ప్రభుత్వంకు అనుసంధాన కర్తలుగా పనిచేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చుటతోపాటు నిధులు రాబట్టాలన్నారు.  ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునిఠ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ పథకాలకు రావలసిన నిధులను రాబట్టుటలో నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు.  ప్రత్యేకించి లైజనింగ్ అధికారులు కేంద్ర అధికారులు, క్రిందిస్థాయి అధికారులతో సత్సంబంధాలు కలిగి ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విశదీకరించి నిధులు మంజూరు, నిధుల విడుదలకు కృషి చేయాలని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి 8 ప్రాధాన్యత రంగాల్లో 84 పథకాలకు సంబంధించి నిధులు రాబట్టే అవకాశం వున్నదని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేసే నిధుల్లో మన రాష్ట్రానికి 6.40% శాతం నిధులు మాత్రమే విడుదల అవుతున్నాయని, ఈ నిధులను మరింత ఎక్కువగా రాబట్టేన్దుకు కృషిచేయాలన్నారు.  నిధుల మంజూరు, విడుదలకు కేంద్ర అధికారులు కోరిన వివరాలను రాష్ట్రప్రభుత్వం నుంచి తీసుకుని, కేంద్ర అధికారులకు వివరించి నిధులు రాబట్టటంలో సఫలీకృతం కావాలని స్పష్టం చేశారు. సామాజిక సాధికారికత, ప్రయిమరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్, పట్టణాభివృద్ధి, నాలెడ్జ్ స్కిల్ డెవలప్మెంట్, రెవిన్యూ రాబడుల రంగాల్లో కేంద్రం నుంచి ప్రధానంగా నిధులు రాబట్టవచ్చునని వివరించారు. రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాన్య ప్రజలకు ఎపి భవన్ అధికారులు, సిబ్బంది అవినాభావ సంబంధాలు కలిగి ఉండి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఉద్భోదించారు.దేశ రాజధానిలో ఎపి భవన్ సేవలు, సాధిస్తున్న ప్రగతిని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విశదీకరించారు.  ఎపి భవన్ లో అధికారులు, లైజన్ అధికారులు నిరంతరం కేంద్ర అధికారులు, మంత్రిత్వ శాఖలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ రాష్ట్రానికి నిధులు రాబట్టుటలో నిరంతరం కృషిచేస్తున్నారని వివరించారు.  8  ప్రయారిటీ మిషన్లు, 84 ప్రాధాన్యత పథకాల నుంచి నిధులు రాబడుతున్నట్లు చెప్పారు.  ప్రాధాన్యత కలిగిన ప్రయారిటీ మిషన్ 54 రంగాలకుగాను 13 రంగాల్లో మొదటి స్థానం, 28 రంగాల్లో 2వ స్థానం, మిగిలిన రంగాల్లో 5 నుంచి 10 స్థానాలమధ్య రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకింగ్ కలిగివున్నట్లు చెప్పారు.  ఎన్సీఆర్ పరిధిలోని తెలుగువారికి రాష్ట్ర ప్రగతిని వివరించేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఎపి భవన్ కు అనుబంధంగా వున్న లేపాక్షి, యితర శాఖల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,  ప్రచార హోర్డింగులు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ విస్తృత ప్రచారంగావిస్తున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ వివరించారు.ఈ సమావేశంలో ఎపి భవన్ న్యూ ఢిల్లీ లోని ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు స్పెషల్ కమీషనర్ శ్రీమతి భావనా సక్సేనా, ఎపి భవన్ జాయింట్ కమీషనర్ టి. సూర్యనారాయణ, ఎపి ఐసీ , లీగల్ సెల్ ప్రత్యేక అధికారులు కె. జయ రావు, శ్రీమతి సరళాదేవి, అసిస్టెంట్ కమిషనర్లు లింగరాజు, ఎంవిఎస్ రామారావు, శ్రీమతి వెంకట రమణ, అనంద రావు, ఎఒ శ్రీమతి రమాదేవి, ఎపిఎఒ భానుప్రసాద్,  ఆర్ & బి డి ఇ రవి నాయక్, టూరిజం అధికారి రామకోటయ్య, డా. రమాదేవి,  లైజన్ అధికారులు  పాల్గొన్నారు.

Related Posts