YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో డెలాయిట్ కంపెనీ

ఏపీలో డెలాయిట్ కంపెనీ
ఆంధ్రప్రదేశ్‌లో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌, గ్లోబల్‌ ఎంప్లాయిస్‌ సేవలను, కన్సల్టెంట్‌‌, ఆడిట్‌ సేవలను డెలాయిట్‌ అందిస్తోంది. త్వరలో అమరావతి తాత్కాలిక భవనంలో డెలాయిట్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది. విశాఖలో కూడా కార్యకలాపాలను సాగించాలని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కోరారు. విశాఖలో అవకాశాలపై అధ్యయనం చేస్తామని, త్వరిత గతిన కంపెనీ ఏర్పాటుపై దృష్టిపెడతామని డెలాయిట్‌ పేర్కొంది. గ్లోబల్ బిజినెస్ ట్యాక్స్ సర్వీసెస్,గ్లోబల్ ఎంప్లొయ్ సర్వీసెస్,కన్సల్టింగ్ సర్వీసెస్,ఆడిట్ సర్వీసెస్ అందిస్తున్న డెలాయిట్.ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలు సంస్థల ప్రతినిధులు ఆయా ఒప్పందాల ప్రతులను మార్చుకున్నారు..ఆ ఒప్పందాలివే.. హెచ్‌.డి.ఎఫ్‌.సి.బ్యాంకు విశాఖలో ‘యాక్సెలరేటర్‌’ కార్యాలయాన్ని ప్రారంభించి అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి, బ్యాంకింగ్‌ రంగ ఉత్పత్తుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. .. డబ్ల్యు-హబ్‌ సంస్థ హాంకాంగ్‌లో ‘అంతర్జాతీయ ల్యాండింగ్‌ ప్యాడ్‌’ ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌ సంస్థలకు సహకారం అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. .. సోసా అనే సంస్థ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ భాగస్వామ్యంతో ఇజ్రాయెల్‌లో ల్యాండింగ్‌ ప్యాడ్‌ ఏర్పాటు చేయనుంది. సోసా సంస్థ విస్తృత యంత్రాంగం నుంచి ప్రయోజనాలు పొందడంతోపాటు మన రాష్ట్ర సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు సాగించడానికీ సహకరించనుంది. ..సింగ్‌ఎక్స్‌ సంస్థ రాష్ట్రంలో పలు అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. .. వాద్వాని, ఉద్యమ్‌ సంస్థలు అంకుర సంస్థలకు అవసరమైన సేవలు, శిక్షణ అందించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ..హాంకాంగ్‌ ఫిన్‌టెక్‌ సంఘం విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీ అధికారులతో ఒప్పందం చేసుకుంది. .. విశాఖలో ఇన్నోవేషన్‌ హబ్‌ నిర్మాణానికి అవసరమైన సేవలను బైజోఫోర్స్‌ సంస్థ రాష్ట్రప్రభుత్వ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది. .. యు.కె.కు చెందిన అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ ‘ఛార్టడ్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌’(సి.ఐ.ఎస్‌.ఐ.) తరపున పలు కోర్సుల నిర్వహణకు, వివిధ కోర్సుల్లో నిపుణుల తయారీకి గీతం విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

Related Posts