YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిరాశకు గురిచేస్తున్నఏపీటీడీసీ ప్రాజెక్టు

 నిరాశకు గురిచేస్తున్నఏపీటీడీసీ ప్రాజెక్టు
అరకు ప్రయాణమంటే రైలు బండిలో పచ్చని కొండల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లాలి. అదీ అద్దాల రైలులో అయితే ఆ అనుభూతే వేరు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొండ గుహల నడుమ ఒంపు సొంపులతో సాగాల్సిన ఈ రైలు ప్రయాణానికి విఘాతం కలిగింది. కొండ చరియలు పడి రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం పర్యటక ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తే..రోడ్డు కం రైలు ప్యాకేజీ పర్యాటక శాఖ రద్దుచేయడంతో ఈ ఏడాది పర్యాటక శాఖపై పెను ప్రభావాన్ని చూపింది.విశాఖ నగరానికి వచ్చే పర్యటకుల్లో ఎక్కువ మంది అరకును సందర్శించకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. సహజ సిద్ధమైన జలపాతాలు, గిరిజన సంప్రదాయాలు, ప్రకృతి సౌందర్యంతో కనువిందుచేసే ప్రదేశాలెన్నో అరకు సొంతం. ఇవన్నీ చూడాలంటే రైలే ప్రధాన మార్గం. అందుకే పర్యటకులు రోడ్డు మార్గం కంటే రైలు మార్గంలోనే అరకులో పర్యటించాలని ఉత్సాహం చూపుతుంటారు. వీరి కోసం ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యటక ప్యాకేజీలను సైతం నిర్వహిస్తోంది. అరకు పర్యటకంలో ఎక్కువ భాగం ఈ విధమైన టూర్‌ ప్యాకేజీల రూపంలో వచ్చినవే. వర్షాకాలంలో అప్పుడప్పుడు ఈ రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడినా ఒకటి రెండు రోజుల్లో సరిచేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తుంటారు. కాని ఈనెల 7వ తేదీన చిమిడిపల్లి-బొర్రా రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై పడిన బండరాళ్ల ధాటికి ఏకంగా వంతెన మనుగడకే ముప్పు ఏర్పడింది. రైలు పట్టాలపై బండరాళ్లనైతే తొలగించారు కానీ వంతెనను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు వీలు కలిగేలా చేయాలంటే కనీసం  మూడునెలల సమయంపడుతుందని రైల్వే అధికారులుతేల్చారు...అరకు అందాలను చూడడానికి విశాఖపట్నం నుంచి రైలు మార్గంలోనే ఎక్కువ మంది ప్రయాణికులు వెళుతుంటారు. సాధారణ రోజుల్లో ఏపీటీడీసీ ప్యాకేజిల ద్వారా 250 నుంచి 300 వరకు వస్తారు. అదే శని, ఆదివారాల్లో వీరి సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంటుంది. ఇటీవల అరకు అద్దాలు రైలు (విస్టాడోమ్‌) వేశాక రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ప్యాకేజీలతో సంబంధం లేకుండా రైలు అరకు చూడ్డానికి వచ్చేవారు వందల సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు విఘాతం కలగడంతో రైల్వే ఆదాయంతో పాటు పర్యటకంపైనా.. తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఏపీటీడీసీ ప్యాకేజీలను ముందుగా బుక్‌చేసుకున్న సందర్శకులు తీవ్ర నిరాశకు గురవతున్నారు. మూడు నెలలు  అరకు రైలు తిరిగే అవకాశం లేకపోవడంతో రైలు పర్యటకుల ద్వారా సమకూరే ఆదాయాన్ని పర్యటకశాఖ పూర్తిగా కోల్పోనుంది. ఏపీటీడీసీకి ప్రధాన ఆదాయ మార్గం రైలు పర్యటకమే. విశాఖ నుంచి అరకుకు రైలులో తీసుకువచ్చి, అక్కడి నుంచి పర్యటక బస్సుల్లో పద్మావతి గార్డెన్‌, మ్యూజియం చూపించి మధ్యాహ్నం రిసార్ట్‌లో భోజనం పెట్టి థింసా నృత్యం చూపించి అనంతరం బొర్రా గుహలు, జలపాతాలు చూపి విశాఖలో రాత్రి ఏడు గంటలకు దింపేస్తారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున ప్యాకేజీగా వసూలు చేస్తారు. ఒక రోజు నుంచి వారం రోజుల వరకు విడిది చూపించే ప్యాకేజిలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కువ రోజులు అరకులో విడిది చేయాలనుకుంటారు. వీటి ద్వారా రోజుకు ఏపీడీడీసీకి రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కిరండూల్‌ పాసింజరు రద్దుతో ఈ ఆదాయానికి గండి పడిందనిపర్యటకశాఖ అధికారులు ఆవేదనచెందుతున్నారు.సాదారణంగా అక్టోబర్‌ నుంచి జనవరి వరకు పర్యటక సీజన్‌గా పరిగణిస్తారు. దసరా సెలవులు, దీపావళి పండుగ, కార్తీక మాసం, పిక్నిక్‌లు మొదలవుతున్న దశలో రైలు ప్రయాణానికి విఘాతం కలగడం పర్యటకశాఖను ఆందోళనకు గురిచేస్తుంది. సంవత్సరమంతా ఒక ఎత్తయితే ఈ నాలుగు నెలలు ఒక ఎత్తు. స్థానికులతో పాటు చుట్టుపక్కల రాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు అరకు, బొర్రాలకు వస్తుంటారు. పర్యటక ప్రదేశాలు చూడడానికి కూడా ఖాళీ ఉండదు. గడచిన ఏడెళ్లలో అరకు వచ్చిన పర్యాటకుల సంఖ్యను పరిశీలిస్తే...
సంవత్సరం  స్వదేశీపర్యాటకులు    విదేశీ పర్యాటకులు     మొత్తం పర్యాటకులు
2010              5252218                    17775                    5279993
2011              5139627                    28677                    5168304
2012              5273228                    53859                    5327087
2013              6700675                    57476                    6758151
2014              6782784                    54272                    6837056
2015            10416500                    64178                  10480678
2016            17453853                    78266                  17532199
2017            12792100                    61018                  12853118        
2018            14738120                     68976                          15407096
రైలు ప్రయాణం లేకుంటే చాలావరకు పర్యటకుల సంఖ్య తగ్గిపోతుంది. రోడ్డు మార్గంలో వచ్చే పర్యటకులు తక్కువగా ఉంటారు. దీనివల్ల పర్యటక శాఖకు వచ్చే ఆదాయం తగ్గిపోవడమే కాదు. పర్యకులపై ఆధారపడి అరకు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న వ్యాపారాలుపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రైవేటు హొటళ్లు, రిసార్టులపైనా ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైల్వేశాఖ స్పందించి విలైనంత త్వరగా అరకు రైలు తిరిగే విధంగా చేయాలని కోరుతున్నారు..

Related Posts