YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ ను ముందే ప్రకటించే అవకాశం లేదు చిదంబరుడి అంతరంగం

 రాహుల్ ను ముందే ప్రకటించే అవకాశం లేదు చిదంబరుడి అంతరంగం
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య పూర్తిగా సమంజసమైనదేనని నిపుణులు భావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి ఒకవైపు పెరుగుతున్నప్పటికీ, ప్రధాన జాతీయ పక్షం కాంగ్రెస్ ఇప్పటికీ బలహీనంగా ఉండడం, ప్రాంతీయ పార్టీలు అనేక రాష్ట్రాల్లో అప్రతిష్ట పాలై ఉండడంతో డిసెంబర్‌లో జరుగనున్న మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించే శాసనసభ ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పడే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా మారింది.కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడమేననీ, ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదనీ, గతంలో చాలామంది అప్రకటితం గానే దేశ ప్రధానులయ్యారని ఆయన వివరించారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్‌నేత సల్మాన్ కుర్షిద్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ రెండు వ్యాఖ్యానాలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నిరాశావాదానికి ప్రతీక లుగా కాక, వాస్తవ రాజకీయ పరిస్థితిపై సరైన వ్యవహారిక జ్ఞాన అంచనాగా నిలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమని ఇప్పటికే సంకేతాలిచ్చిన పార్టీలు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ముంద స్తుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తుండడంతో వ్యాఖ్యలు అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల కేంద్రిత కూటములు ఏర్పరచడం ద్వారా మాత్రమే ఓట్లను సమీకరించి ఆధిపత్యంలో ఉన్న జాతీయ పార్టీని ఓడించే వ్యూహం ప్రస్తుతం ఆచరణా త్మకమైనది. గత ఏడు దశాబ్దాలుగా దేశ ఎన్నికల ప్రజాస్వామిక ప్రక్రియలో ఈ వ్యూహం తరచూ పునరావృతమవుతున్న ప్రక్రియగా ఉంది. 2004లో కాంగ్రెస్ సైతం ఎన్నికల ముందు, అనంతర పొత్తులు ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాన మంత్రిని ప్రకటించిన విషయం తెలిసిందే.  అదే విధంగా 1989లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో భావజాల పరంగా బద్ధవ్యతి రేకులైన బీజేపీ, వామపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల అనంతర పొత్తులతో ఏర్పడింది. రెండు జాతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడమన్నది ఒక అరుదైన అంశంగా మారిపోయింది. దేశ ఎన్నికల్లో అత్యంత కీలక భూమిక పోషించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడడంతో జాతీయ పార్టీ అయినప్పటికీ, అధికార బీజేపీతో సొంతంగా తలపడడం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్ని కలు ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అధ్యక్షుడికి మధ్య జరిగే సమరంగా భావించడం తగదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించే సీట్లను బట్టి, భాగ స్వామ్య పక్షాల ఆమోదాన్ని బట్టి తాను దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించేం దుకు సంసిద్ధంగానే ఉన్నట్లు మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచార సందర్భంలోను, అక్టోబర్‌లో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ లోను రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ, చిదంబరం ఇద్దరి మాటల్లోనూ ప్రధాని పదవి కాకుండా, కాంగ్రెస్, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలసి బీజేపీని ఓడించడమేనన్న విషయాన్ని గుర్తించడమే. అయితే ప్రతిపక్ష కూటమితో తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటింపజేయడమే లక్ష్యంగా బీజేపీ రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు తిరుగులేని నేతగా నిలిచిన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల అభ్యర్థిని నిలపడం వల్ల వ్యక్తుల మధ్య పోరుగా మారడం తమకు లాభిస్తుందని బీజేపీ-సంఘపరివార్ శక్తులు భావిస్తున్నాయి. అదే సమయంలో ఈ ఎత్తుగడతో ప్రతిపక్షాల్లోని  ప్రధా ని అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న పలువురు నేతల మధ్య పొరపొచ్ఛాలను సృష్టించడం ద్వారా ప్రత్యర్థుల ఐక్యతను దెబ్బతీయొచ్చని ప్రయత్నాలు ము మ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రధాని అభ్య ర్థిని ప్రకటించకుండా జాప్యం చేస్తున్నాయి. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండా ఒక కూటమిగా ఎన్నికల్లో పాల్గొనాలా లేక విడివిడిగా ఎన్నికల బరిలో దిగడ మా అనేది తెలివి తక్కువ వ్యవహారమే కాకుండా, అంత తేలికైన విషయం కాదు. అయితే భావజాల సారూప్యత లేని పార్టీల మధ్య ఎన్నికల ముందస్తు పొత్తులతో ఒక కూటమిగా పోటీకి దిగినప్పటికీ, ఈ అసంఘటిత కూటమి గెలుస్తుందనే నమ్మకం లేకపోయినా, అధికార బీజేపీ పార్టీ గెలుపును కష్టతరం చేస్తుందనడంలో సందేహమే లేదు. అయితే ఎన్నికల అనంతర పొత్తులు అంత తేలికైన వ్యవహారమూ కాదు. కర్ణాటకలో వలె కాంగ్రెస్ పార్టీ తన ప్రాసంగి కతను తగ్గించుకొని పొత్తులు పెట్టుకున్న భాగస్వామ్య పార్టీలకు పెద్ద పీట వేయాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదమూ లేకపోలేదు. దేశవ్యాప్తంగా అనేక రా ష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన నేపథ్యంలో నమ్మదగని రాజకీయ పక్షా లతో కూడా పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు ఏ మేరకు లాభిస్తాయో సందేహమే. సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలు ఒక ‘మహాకూటమి’గా ఏర్పడి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను రూపొం దించుకొని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)తో తలపడుతున్నా యి. సీట్లు కాదు పొత్తు ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భాగ స్వామ్య పక్షాలను సంతృప్తి పరుస్తూ పొత్తు ఏర్పడాలని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేయడంతో గెలుపే ప్రాతిపదికగా పొత్తు చర్చలు, సీట్ల సర్దు బాట్లు ఖరారయ్యాయి. కేవలం అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే కాక, రాబోయే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపిణీ జరిగినట్లు భాగ స్వామ్య పక్షాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అయితే మహా కూటమిలోని పార్టీలు టీఆర్‌ఎస్‌ను ఓడించే లక్ష్యంగా ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయే గానీ, ఆ కూట మిలో ఉన్న వాళ్లంతా ముఖ్యమంత్రి పదవికి ఆశపడే వాళ్లు కావడంతో ఒకరికొ కరికి పొత్తు కుదరక విఫలమవడం ఖాయమని అధికార పక్షం తీవ్రంగా విమ ర్శిస్తోంది. అయితే ప్రజల్లో అధికార వ్యతిరేకత నెలకొన్న పరిస్థితిపై టీఆర్‌ఎస్ ఆందోళన చెందుతోంది. శాసన సభ ఎన్నికలు లేని ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు విడివిడిగా పనిచేస్తున్నాయి. దేశం మరోసారి సంక్లిష్ట రాజకీయాల యుగంలోకి ప్రవేశిస్తుందా అనే విషయం స్పష్టమవడానికి సార్వత్రిక ఎన్నికల దాకా వేచి చూడాలి.   

Related Posts