YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాశి ఫలాలు

 రాశి ఫలాలు

మేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ పరిస్థితులు అనుకూలం. శుభ కార్యాలకు అవకాశం ఉంది. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు. స్నేహితులు, బంధువులతో విందులు, వినోదాలలో పాల్గొంటారు.

వృషభం
(కృత్తిక 2, 3,4, రోహిణి, మృగశిర 1,2)

శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పై అధికారుల మెప్పు కోసం ప్రయుత్నించండి. కోర్టు కేసు వాయిదా పడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

మిధునం
(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1.2.3)

ఆదాయం బాగానే ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు.

 

కర్కాటకం
(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఎంత సంపాదించినా చేతుల్లో డబ్బు నిలవదు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులు అవసరానికి ఆదుకోరు. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)

ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగేయాలి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేవు వ్యవహారాలు విజయువంతం కాకపోవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన క లిగిస్తుంది.

కన్య
(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)

ఆదాయం పెరుగుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సవుస్యలు ఎదురవుతుంటాయి. కోర్టు కేసులు సంతృప్తికరంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగకండి.

తుల
(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)

ప్రయాణాలు ఎక్కువవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు. ప్రమోషన్‌పై బదిలీ అయ్యే అవకాశం ఉంది.

వృశ్చికం
(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

బంధు మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ ఇప్పట్లో రాకపోవచ్చు. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తగదు. 

ధనస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొత్త ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటారు. ఉద్యోగం మారడానికి మీ కుటుంబం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగవచ్చు.

మకరం
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయుత్నాలు ఫలిస్తాయి.  ప్రేమ వ్యవహారాలు మీకు ఇబ్బబందులు సృష్టించవచ్చు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తిప్పట ఎక్కువ. 

కుంభం
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రమోషన్‌కి, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. బంధు మిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి బాజాలు మోగుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు.

మీనం
(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కింది ఉద్యోగులతో సవుస్యలు తలెత్తుతాయి. పని భారం పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల నుంచి సవుస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలకు సిద్ధవువుతారు. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

Related Posts