YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోంది: జగన్ జగన్ హత్యయత్యాన్నిఖండించిన నేతలు

ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోంది: జగన్    జగన్ హత్యయత్యాన్నిఖండించిన నేతలు
తాను దేవుడి దయవల్ల క్షేమంగానే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ వైకాపా అధినేత జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై దాడి తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉండగా.. ఆయనతో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో జగన్‌ భుజానికి గాయమైంది. దీంతో తొలుత విశాఖలోనే ప్రథమ చికిత్స చేయించుకున్నజగన్‌.. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్‌కు చేరుకొని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్య సమాచారంపై ట్వీట్‌ చేశారు. కాగాహైదరాబాద్‌లో జగన్‌ చికిత్సపొందుతున్న ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొందరు అభిమానులు అక్కడికి చేరుకొని జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. మరో వైపు ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.హైదరాబాద్‌: వైకాపా నేత వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేత పార్థసారధి అన్నారు. జగన్‌పై దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్‌ నిఘాలో ఉండే విమానాశ్రయంలోకి ఎవరైనా వెళ్లగలిగారంటే.. దీనివెనుక పెద్దల హస్తం లేకుండా, కుట్ర లేకుండా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితుడు వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి దాడి చేయగలిగాడంటే భద్రతా వైఫల్యం పూర్తిగా కనడుతోందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
తెదేపా హస్తం ఉందని జోగి రమేశ్‌ ఆరోపణ
విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి వెనుక తెదేపా నేతల హస్తం ఉందని తాము భావిస్తున్నట్టు వైకాపా నేత జోగి రమేశ్‌ వ్యాఖ్యానించారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న హోటల్‌ తెదేపా నేతకు చెందినది అన్నారు. రాష్ట్రంలో వేల కి.మీలు నడుస్తూ సామాన్యుడిలా ఎండను, వానను ఎదుర్కొని ముందుకెళ్తూ లక్షల మంది ప్రజల మనస్సులను చూరగొంటున్న జగన్‌పై కావాలనే దాడి చేయించినట్టు ఆరోపించారు. ఈ ఘటనపై నిజానిజాలు బయటకు రావాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకుందామని, ఎన్నికల్లో పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది అని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని, కుట్రదారులెవరో తేలాలని డిమాండ్‌ చేశారు.
జగన్‌పై జరిగిన దాడిఅమానుషం: లోకేష్ 
హైదరాబాద్‌: విశాఖ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని ఏపీ మంత్రి నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా ఖండించారు. ‘ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పిరికిపంద చర్యలకు స్థానం ఉండదు’ అని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.
జగన్‌పై దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది: సురేశ్‌ ప్రభు
ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు కూడా స్పందించారు. ‘జగన్‌పై దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్‌ఎఫ్‌ సహా అన్ని దర్యాప్తు సంస్థలను ఆదేశించాం. ఇలాంటి పిరికిపంద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నిందితులకు శిక్ష పడుతుంది’ అని సురేశ్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. 
ఈ దాడి పిరికిపందల చర్య:యుబిఎస్పి
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని యునైటెడ్ భహుజనపోరాట సమితి జాతీయ కన్వినర్ కరణం తిరుపతి నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసారు.ఈ దాడి పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని తిరుపతి నాయుడు ఆరోపించారు.ఈ దాడి ఫైవిమానయాన శాఖా మంత్రి సురేష్‌ ప్రభు వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒక మనిషి కత్తితో ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా వెళ్లగలిగాడని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూడా వీఐపీలకు భద్రత లేకుంటే ఎలా అనిఆయన ప్రశ్నించారు.
దాడి హేయనీయం: మంత్రి కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. జగన్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపించాలి : రఘువీరా రెడ్డి
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి దారుణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్‌ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్‌ రఘువీరా రెడ్డిలు వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.జగన్‌ మోహన్‌ రెడ్డికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులో ఈ దాడి జరగడం నిఘా వైఫల్యమేనని, ఈ దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

Related Posts