YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బౌతిక దాడులను ఉపేక్షించేది లేదు: ఏపీ సిఎం చంద్రబాబు

 బౌతిక దాడులను ఉపేక్షించేది లేదు: ఏపీ సిఎం చంద్రబాబు
వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధంలేని విషయమని స్పష్టంచేశారు. ఈ ఘటనను అడ్డంపెట్టుకొని అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు.మరోవైపు, జగన్‌పై దాడిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ముక్తకంఠంతో ఖండిస్తుండగా.. ఏపీలో పలు చోట్ల వైకాపా శ్రేణులు ఆందోళనలకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే డీజీపీకి స్పష్టమై ఆదేశాలు ఇచ్చామని, ప్రభుత్వం సీరియస్‌గా విచారణ జరుపుతోందని, వాస్తవాలను బయటకు తీసుకొస్తామంటూ పలువురు మంత్రులు చెబుతున్నారు.
ఖంఢించిన ఏపీ హోం మంత్రి చినరాజప్ప
విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. విమానాశ్రయంలో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఆయన వివరించారు. అసలు కత్తి విమానాశ్రయంలోకి ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుగుతోందని, నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. మరో గంటలో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చినరాజప్ప తెలిపారు.

Related Posts