వెస్టిండీస్తో చివరి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించారు. గౌహతి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. విశాఖపట్నం వేదికగా నిన్న రాత్రి ముగిసిన రెండో వన్డేని టైగా ముగించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మిగిలిన మూడు వన్డేల కోసం ఈరోజు ఎంపిక చేసిన జట్టులో షమీపై వేటు వేసిన సెలక్టర్లు.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లకి చోటిచ్చారు.
భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే
వెస్టిండీస్తో పుణె వేదికగా శనివారం మూడో వన్డే ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత 29న ముంబయి వేదికగా నాలుగో వన్డే, నవంబరు 1న తిరువనంతపురం వేదికగా చివరి వన్డే ఆడనుంది.