ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి పిరికి దాడులకు ఈ సమాజంలో తావు లేదని ట్వీట్ చేశారు. జగన్పై దాడి ఘటనను పలువురు మంత్రులు కూడా ఖండించారు. మంత్రి జవహర్, నక్కా ఆనందబాబు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావని.. ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గురువారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై ఈ దాడి జరిగింది. హైదరాబాద్ వచ్చేందుకు.. విమానం కోసం లాంజ్లో ఎదురు చూస్తున్న జగన్పై క్యాంటిన్లో పనిచసే వెయిటర్ దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. జగన్కు అక్కడే ప్రాథమిక చికిత్స అందించగా.. ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నేరుగా నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.