YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అర్జున్, శ్రుతిల మధ్య రాజీ కుదిర్చేప్రయత్నం .. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు హరీశ్

అర్జున్, శ్రుతిల మధ్య రాజీ కుదిర్చేప్రయత్నం .. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు హరీశ్
ప్రముఖ నటుడు అర్జున్పై నటి శ్రుతి హరిహరణ్ చేసిన ఆరోపణలతో కన్నడ చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయే పరిస్థితి తలెత్తింది. మీటూ  ఉద్యమానికి మద్దతిస్తూ కొందరు నటీనటులు నటి శ్రుతికి మద్దతు తెలుపుతుండగా, ఉద్దేశపూర్వకంగానే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారంటూ అర్జున్కు అదే స్థాయిలో బాసటగా నిలుస్తున్న వారు ఉన్నారు. శాండల్వుడ్కు ఇలాంటి మరకలు అంటించవద్దంటూ సినీ ప్రముఖులు శ్రుతి తీరును తప్పుపడుతున్నారు. 
ఈ నేపథ్యంలో కన్నడ చిత్ర పరిశ్రమ కమిటీ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) స్పందించింది. గురువారం అర్జున్, శ్రుతిల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయనున్నట్లు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు హరీశ్ తెలిపారు. కళాకారుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు అంబరీశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి.. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చి వేధింపుల ఆరోపణలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. కేఎఫ్సీసీ పెద్దలు వీరిమధ్య ఏం చెప్పి రాజీ కుదర్చనున్నారన్న దానిపై కన్నడ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 
మరోవైపు నటి శ్రుతి మాత్రం.. అర్జున్పై తన ఆరోపణల వెనుక ఎవరి హస్తం లేదని స్పష్టంచేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, చేతన్, కవిత తనకు ప్రోత్సహించి.. అర్జున్పై ఆరోపణలు చేపించారన్నది దుష్ప్రచారమంటూ కొట్టిపారేశారు. వేధింపుల వ్యవహారం కోర్టు వరకు వెళ్తే.. వేధింపులకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. నటి శ్రుతికి అర్జున్ క్షమాపలను చెప్పడంతో తప్పేమీ లేదని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించడం, కుట్రపూరిత ఆరోపణలేనని ప్రచారం జరుగుతోంది. 

Related Posts