YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న.. డీఎస్సీ షెడ్యూల్ విడుదల

 ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న..   డీఎస్సీ షెడ్యూల్ విడుదల
ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 9 గంటలకు షెడ్యూల్ను ప్రకటించిన మంత్రి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సారి టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తామని ప్రకటించారు. అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబరు 1 నుంచి దరఖాస్తులను స్వీకరణ మొదలవుతుందని తెలిపారు. డిసెంబరు 6 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు 29 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 7,676 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలే అధికంగా ఉన్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్లకు అవకాశం కల్పిస్తున్నందున వీటికి పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది. 
 
ఆన్లైన్ విధానంలోనే రాత పరీక్షను నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. డిసెంబరు 6, 10 న స్కూల్ అసిస్టెంట్లకు, డిసెంబరు 11న ఎస్ఏ (లాంగ్వేజెస్), డిసెంబరు 12, 13 తేదిల్లో పీజీటీలకు పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 14, 26న టీచర్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్ పోస్టులకు, డిసెంబర్ 17 పీఈటీ, మ్యూజిట్, క్రాప్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు ఎస్జీటీ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. నవంబరు 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాలను ఎంపికచేసుకునే అవకాశం కల్పిస్తారు. 
నవంబరు 17 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాల్లో 4,341, మున్సిపల్ పాఠశాలల్లో 1,100, ఆదర్శ పాఠశాలల్లో 909, బీసీ సంక్షేమ శాఖలో 300, గిరిజన సంక్షేమ శాఖలో 800లతో సహా మొత్తం 7,657 పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు 1,625, లాంగ్వేజ్ పండిట్స్ 452, ఎస్జీటీలు 3,666 ఉన్నాయి. అభ్యర్థులకు వయోపరిమితి కూడా రెండేళ్ల సడలింపు ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గరిష్టంగా 49 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి జులైలోనే డీఎస్సీ నోటిిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా అప్పట్లో ప్రకటించారు. కానీ రేషలైజేషన్ పేరుతో కొన్ని పోస్టులను తొలగించారు. 
స్కూల్ అసిస్టెంట్లకు డిసెంబరు 12, పీజీటీలకు డిసెంబరు 14న, పీఈటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ విభాగాలకు డిసెంబరు 18 న, టీజీటీ, ప్రిన్సిపాల్ డిసెంబరు 28, ఎల్పీటీలకు డిసెంబరు 28, సెకెండరీ గ్రేడ్ పోస్టులకు జనవరి 3 న కీ విడుదల చేస్తారు. వీటిపై అభ్యంతరాలను గడువు కీ విడుదలైన రెండు రోజుల వరకు స్వీకరిస్తారు. ఆయా పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తారు. తర్వాత రెండు రోజుల్లో మెరిట్ జాబితా, ఇది ప్రకటించిన రెండు రోజుల్లో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటిస్తారు.
నోటిఫికేషన్ షెడ్యూల్ 
డీఎస్సీ నోటిఫికేషన్ ఫీజు చెల్లింపు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం దరఖాస్తు గడువు పరీక్షా కేంద్రాల ఎంపిక ఆన్లైన్ మాక్ టెస్ట్ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్
అక్టోబరు 26 నవంబరు 1 నుంచి 15 వరకు నవంబరు 1 నవంబరు 16 నవంబరు 19 నుంచి 24 వరకు నవంబరు 17 నవంబరు 29 నుంచి
పరీక్షల షెడ్యూల్ 
ఎస్ఏ (నాన్-లాంగ్వేజెస్) ఎస్ఏ (లాంగ్వేజెస్) పీజీటీ టీజీటీ, ప్రిన్సిపాల్ పీఈటీ, ఆర్ట్స్, 
మ్యూజిక్, క్రాఫ్ట్స్ లాంగ్వేజ్ పండిట్స్ ఎస్జీటీ
డిసెంబరు 6, 12 డిసెంబరు 11 డిసెంబరు 12, 13 డిసెంబరు 14, 26 డిసెంబరు 17 డిసెంబరు 27 డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు
 కీ, తుది కీ, ఫలితాలు 
విభాగం ప్రాథమిక కీ విడుదల అభ్యంతరాల స్వీకరణ తుది కీ ఫలితాలు మెరిట్ లిస్ట్ ప్రాథమిక ఎంపిక జాబితా
ఎస్ఏ (లాంగ్వేజెస్, నాన్-లాంగ్వేజెస్) డిసెంబరు 12 డిసెంబరు 12 నుంచి 14 వరకు డిసెంబరు 18 డిసెంబరు 20 డిసెంబరు 22 డిసెంబరు 24
పీజీటీ డిసెంబరు 14 డిసెంబరు 14 నుంచి 16 డిసెంబరు 20 డిసెంబరు 22 డిసెంబరు 24 డిసెంబరు 26
పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ డిసెంబరు 18 డిసెంబరు 20 వరకు డిసెంబరు 22 డిసెంబరు 24 డిసెంబరు 26 డిసెంబరు 28
టీజీటీ, ప్రిన్సిపాల్ డిసెంబరు 27 డిసెంబరు 27 నుంచి 29 జనవరి 2 జనవరి 4 జనవరి 6 జనవరి 8
లాంగ్వేజ్ పండిట్ డిసెంబరు 28 డిసెంబరు 28 నుంచి 30 జనవరి 3 జనవరి 5 జనవరి 7 జనవరి 9
సెకెండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) జనవరి 3 జనవరి 3 నుంచి 6 వరకు జనవరి 10 జనవరి 12 జనవరి 14 జనవరి 16

Related Posts