విశాఖపట్నం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ విసిరిన ఓ గూగ్లీ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. ఆ ఓవర్ ఐదో బంతిని గూగ్లీ రూపంలో విసరగా.. దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైన మార్లోన్ శామ్యూల్స్ (13: 10 బంతుల్లో 3x4) క్లీన్ బౌల్డయ్యాడు. బంతి అతని బ్యాట్ పక్క నుంచి వెంట్రుక వాసి దూరంలో వెళ్లి బెయిల్స్ను పడగొట్టింది. ఈ ఔట్పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్కి నివేదించగా.. రిప్లైలో శామ్యూల్స్ ఔటని తేలింది.
మ్యాచ్లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 67 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.