బాలీవుడ్ నటి రాఖీసావంత్ ‘మీటూ’ ఉద్యమంతో ప్రకంపనలు సృష్టించిన నటి తనుశ్రీ దత్తా ఫై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ విషయాన్ని చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పిన రాఖీ.. ఓ అమ్మాయిని మరో అమ్మాయి రేప్ చేయడమేంటని అనుకోవద్దని పేర్కొంది. ఇప్పుడందరి దృష్టి మీటూపైనే ఉందని, ఇప్పుడు 'షీటూ' ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉందని విలేకరులతో చెప్పుకొచ్చింది. తనుశ్రీ 12 ఏళ్ల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్ అని, తనను డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేసేదని ఆరోపించింది.తనుశ్రీ తన శరీరంపై ఎక్కడెక్కడ చేతులు వేసిందీ కోర్టులోనే చెబుతానని రాఖీ స్పష్టం చేసింది.