నిన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ, ఈ ఉదయం అమరావతి ప్రాంతంలో వైకాపా కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను పెంచారు. నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుండగా, శాంతిభద్రతలపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే సీఎం నివాసానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్, అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు సీఎం నివాసం వైపు దూసుకు రావచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది.