YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మారుతోన్న ఉండవల్లి స్వరం..

మారుతోన్న ఉండవల్లి స్వరం..
నెల‌కు ఒక‌సారి ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌స్తారు. ఆయ‌న ఏ పార్టీనో ఆయ‌న‌కూ తెలియ‌దు. జ‌నాల‌కు తెలియ‌దు. కానీ ఒక ప్రెస్‌మీట్ పెట్టి చంద్ర‌బాబును విమ‌ర్శించి వెళ్లిపోతారు. అయితే, సాధార‌ణంగా చాలా తెలివితేట‌ల‌తో మాట్లాడే ఉండ‌వ‌ల్లి మాట‌ల్లో ఈ మ‌ధ్య ఏదో తేడా కనిపిస్తోంది. ఆయ‌న మాట‌ల వెనుక ఎవ‌రో ఉన్న‌ట్టు, ఏవో ఉద్దేశాలు ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దీనికి కార‌ణం ఉండ‌వ‌ల్లికి సాధార‌ణంగా ఉండే ఫ్లో ఈ ప్రెస్ మీట్ల‌లో క‌న‌ప‌డం లేదు.పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తి అయ్యిందని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ మే నెలలో నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. అంటే ఇక ఏడు నెల‌ల్లో మిగ‌తా 42 శాతం ప‌నులు ఎలా చేస్తార‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. అయితే, ఆరోజు చంద్రబాబు చెప్పిన మాట‌లు ఉండ‌వ‌ల్లి స‌రిగా విన‌కుండానే మాట్లాడారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆరోజు చంద్ర‌బాబు చెప్పింది ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీళ్లు ఇస్తామ‌ని కాదు. కాలువలు పూర్తి అవుతాయి. ప్రాజెక్టు పూర్తికాక‌పో్యినా ఈనెల 24 నాటికి లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు పూర్తి చేసి డిసెంబర్‌ నుంచి గేట్లు బిగిస్తారు. ఆ కాప‌ర్ డ్యామ్ ద్వారా కాలువల‌కు మ‌ళ్లించి నీటిని ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. కానీ అదంతా క‌న్వీనియెంట్‌గా మ‌రిచిపోయి ఎవ‌రికోస‌మో ఉండ‌వ‌ల్లి ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఉండ‌వ‌ల్లి ఇంకో మాట ఏమ‌న్నారంటే.. పోలవరం పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్ర‌తి వారం పుంఖాను పుంఖాలుగా చిత్రాల‌తో స‌హా ప్రాజెక్టు పురోగ‌తి పేప‌ర్ల‌లో, మీడియాలో గ‌వ‌ర్న‌మెంటు వెబ్‌సైట్ల‌లో క‌నిపిస్తోంది. పోల‌వ‌రం ఏ అంశమూ దాచ‌లేదు. ఉండ‌వ‌ల్లి వెళ్లినా క్లియ‌ర్ గా వివ‌రిస్తారు. మ‌రి మ‌ళ్లీ శ్వేతప‌త్రంలో కొత్తగా చెప్ప‌డానికి ఏముంది. ప్ర‌తి వివ‌రం ప్ర‌జ‌ల‌కే నేరుగా తెలిసిన‌పుడు ఉండ‌వ‌ల్లి శ్వేత‌ప‌త్రం ఎవ‌రికోసం అడుగుతున్నారు?
ఆయ‌న రాజధాని గురించి కూడా కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. రాజ‌ధానికి అని చెప్పి అప్పులు చేసినా శాశ్వత భవనాలు లేవని ఆరోపించారు. అంటే తాత్కాలిక భ‌వ‌నాలు డ‌బ్బులు లేకుండా ఎలా క‌డ‌తారో ఉండ‌వ‌ల్లి గారే చెప్పాలి. పేరు తాత్కాలిక‌మే గాని అక్క‌డ క‌ట్టిన భ‌వ‌నాలు అయితే సినిమా సెట్టింగులు కాద క‌దా ఉండ‌వ‌ల్లి గారు అని సామాన్యులు ప్ర‌శ్నించేంత చిన్న విష‌యాల‌పై ఉండ‌వ‌ల్లి ఎవ‌రి ప్రోత్సాహంతో దృష్టిసారించారో మ‌రి?

Related Posts