ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం వైసీపీ నుంచి మైనారిటీ నాయకులు భారీగా టీడీపీలోకి వలస వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం వైసీపీ నేతలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గం మైనారిటీ నాయకురాలు, చాగలమర్రి ఎంపీటీసీ జి.బేబున్నీసా, ఆమె కుటుంబ సభ్యులు, మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా, ఖలీల్,బాబూ సున్నీతోపాటు వంద మంది వార్డు ఇన్ ఛార్జులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు మైనార్టీ నాయకులు కొలిమి హుస్సేన్ వలీ, కొలిమి షరీఫ్, కొలిమి మా భాష, :కొలిమి చిన్న హుస్సేన్ వలీ, కొలిమిహోటల్ హుస్సేన్ వలీ, కమల్ అహమ్మద్, జి జి గారి ష రీఫ్, బొల్లవరం మమ్మద్ ఖాసిం, బొల్లవరం హుస్సేన్ వలీ, మరో వంద కుటుంబాలు మైనార్టీ నాయకులు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆన్సర్ బాషా, టిడిపి మండల కన్వీనర్ నరసింహారెడ్డి లు పాల్గొన్నారు. మైనారిటీ నాయకులను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మైనారిటీలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మీరంతా మా కుటుంబ సభ్యులు అని వివరించారు. అభివృద్ధికి మారు పేరుగా నిలిచిన మంత్రి భూమా అఖిల ప్రియను, ఆళ్లగడ్డ టీడీపీని బలపరిచేందుకు తాము వైసీపీని వీడి వచ్చినట్లు మైనారిటీ నాయకులు పేర్కొన్నారు