YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృద్దిని అడ్డుకుంటున్న కేంద్రం కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

అభివృద్దిని అడ్డుకుంటున్న కేంద్రం కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
విజయవాడలో జరిగిన రెండవ రోజు  కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తిత్లీ తుఫాన్ బాధితులను పట్టించుకోకుండా పార్టీ కార్యాలయం ప్రారంభించుకుంటారు. కేంద్రం సాయం చేయదు.  చేయనివ్వదు. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటోంది. ప్రతి చోట ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గవర్నర్ వ్యవస్థనే వ్యతిరేకించానని అయన అన్నారు. కేంద్రానికి గూఢచారిలా వ్యవహరించడం మినహా ఏం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో స్పందించినంత వేగంగా తిత్లీ తుఫానుపై స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష ధోరణిపై మండిపడ్డారు. మూడోసారి మూకుమ్మడిగా ఐటీ దాడులు చేస్తున్నారు. సీబీఐ విషయంలో మిడ్నైట్ డ్రామా నడిచింది. ప్రజలకు న్యాయం జరగాలంటే ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఎదుర్కోవాలి. మనం న్యాయం అడిగినప్పుడు కేంద్రం అణచివేసే ధోరణి అవలంభిస్తున్నప్పుడు, మనందరం శక్తిని కూడగట్టుకోవాలని అన్నారు.  విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులకు కేంద్రం అడ్డం పడుతోంది. రూ.1000కోట్ల విలువైన 750ఎకరాల భూములిచ్చాం. 5ఏళ్లు అవుతున్నా సర్వీసులకు అడ్డంకులు పెడుతున్నారు. సింగపూర్ కు విమానం నడపడానికి ఇన్నేళ్లు తీసుకుంటారా? వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇవ్వలేదు. ఆ నిధులను రాష్ట్రమే సమకూర్చింది. కస్టమ్స్ పెట్టడానికి వాళ్ళు స్వల్పంగా నిధులు అడిగారు. దానికీ కేంద్రం ముందుకు రాలేదు. వాళ్ల బెంచీలకు,కుర్చీలకు మనమే డబ్బులిస్తామన్నాం.అయినా కస్టమ్స్ పెట్టకుండా అడ్డం పడుతున్నారని అన్నారు. ఆ రోజు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా  అభివృద్ధిని అడ్డుకుంటోంది.  ప్రతి చోటా ప్రజల మనో భావాలు దెబ్బతీస్తున్నారు.  ప్రత్యేక హోదా అడిగాం. విభజన చట్టం అమలు చేయమని అడిగాం.  చేయలేదు కాబట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నాం.  ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛఉంది.  రిప్లై ఇవ్వడానికీ స్వేచ్ఛ ఉండాలి. నిన్నటి సంఘటనలతో కొంచెం ఆటంకం వచ్చిందని అన్నారు. మనం న్యాయం అడిగితే మనల్ని అంతమొందించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మనం రాజకీయ పోరాటం చేయటం అనివార్యం అయ్యింది. చాలా వరకు మనం చేసే పనులను సమర్ధంగా చేయలేకపోవటంలో సమస్యలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఓ పక్క తీవ్రవాదులు, ఓ పక్క మతోన్మాదులు, ఓ పక్క ఫ్యాక్షనిజం..ఇవన్నీ ఎదుర్కొన్నామని అన్నారు. గతంలో తిరుపతిలో సైకో చేసిన భయోత్పాతాన్ని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు. తన చొరవ మేరకే గాంధీ నేతృత్వంలో ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టించాను. ఆ తరువాత తన చొరవతోనే తిరుపతి సైకో ఆగడాలను కట్టడి చేశామన్నారు. భవిష్యత్లో దేవాలయాల దగ్గర కుట్రలు చేస్తారు. తిరుమలను వివాదాస్పదం చేయాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి హిందువులకు వ్యతిరేకం చేయాలని చూస్తున్నారు. చర్చిలపైనా దాడులు జరుగుతాయి. గతంలో ఇలాంటి ఘటనలు తలెత్తితే అణచివేశాం, భవిష్యత్లోనూ రాజీ పడే ప్రస్తక్తే లేదని స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వానికి హిందువులను వ్యతిరేకం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. రమణదీక్షితుల ద్వారా బురద జల్లించారు. నగలు మాయం అయ్యాయని అపోహలు రేకెత్తించారని అన్నారు. 

Related Posts