సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేడు దేశవ్యాప్తంగా నిరసనకు దిగింది. దేశంలోని అన్ని సీబీఐ కార్యాలయాల ఎదటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దూకి సీబీఐ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటర్ కేనన్లు, భాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.