ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పై జరిగిన దాడి వెనుక లేదని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం లేదని హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఎక్కడైనా దాడి జరిగిందా అని ప్రశ్నించారు. జరిగిన ఘటన పై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం అని చెప్పారు.దాడి చేసిన శ్రీనివాసరావు జగన్ కు వీరాభిమాని అని, కేవలం సానుభూతి కోసమే ఈ దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు అని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లోపల భద్రత మొత్తం కేంద్రం ఆధీనంలో ఉంటుందన్న కనీస అవగాహన కూడా ప్రతిపక్ష పార్టీలకు లేకపోవడం శోచనీయమన్నారు. ఈదాడి పై కేంద్రమే సమాధానం అని డిమాండ్ చేశారు. ఈ ఘటనను రాజకీయం చేసి లబ్ది పొందాలని వైసిపి భావిస్తుందని ఆరోపించారు.