శనివారం నుంచి శతజయంతి ఉత్సవాలు
చెన్నారెడ్డి గొప్ప ప్రజా నాయకుడని మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. గురువారం అయన విలేకరులతో మాట్లాడుతూ ..చెన్నారెడ్డి ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదని స్పష్టం చేసారు .చెన్నారెడ్డి నాయకత్వ పటిమను యావత్తు దేశం కొనియాడిన నేతని చెప్పారు . చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు . ఈ ఉత్సవాలకు మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు దేశం నలుమూలల నుంచి హాజరు కాబోతున్నారు శనివారం నుంచి ప్రారంభమైయ్యే ఉత్సవాలు సంవత్సరం పొడుగునా జరుగుతాయి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు.