YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

నవ్వడం కాదు..అందరిని నవ్వించండి..

నవ్వడం కాదు..అందరిని నవ్వించండి..

☘ తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!

☘  చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

☘ రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి!

☘ గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి!

☘ బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది!

☘ ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు..?
జవాబు: ఒలుచుకొని

☘ హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు!

☘ నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?
జవాబు:మెలకువ వస్తుంది

☘ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లు ఎందుకు పెడతారు?
జవాబు: డ్రైవర్ ని నిద్ర లేపడానికి...

☘ సెల్ ఫోన్ పొతే ఏమౌతుంది..?
జవాబు:మనశ్శాంతి ప్రీగా వస్తుంది

☘ నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?  
జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి
☘ టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం.?
జవాబు : ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి.!
☘ అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?
జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని

☘ భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళతారు? జవాబు: మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని

☘ స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది...?
జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని
☘ పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు....?    జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి????...

 

Related Posts