అర్ధరాత్రి వేళ తన అధికారాలను తొలగించి, సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆలోక్ వర్మపై వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను ఆదేశించింది. అంతేగాక.. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టేంత వరకు తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేసింది. ఆలోక్ వర్మపై వస్తున్న ఆరోపణలపై 2 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీవీసీని ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారని తెలిపింది. కాగా.. తదుపరి విచారణ చేపట్టేంతవరకూ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. అక్టోబరు 23 నుంచి ఇప్పటివరకు నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయరాదని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేసింది.సీబీఐ అధినాయకుల మధ్య మొదలైన వర్గ పోరు ఇటీవల తీవ్రరూపం దాల్చి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాను సెలవుపై పంపుతూ మంగళవారం అర్ధరాత్రి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అప్పగించింది. దీంతో కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, సీవీసీలకు నోటీసులు కూడా జారీ చేసింది.కాగాఆలోక్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది ఎఫ్‌ఎస్ నారిమన్ తన వాదనలు వినిపించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఆలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ ఆదేశాలు జారీ చేశాయని నారిమన్ కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం జస్టిస్ రంజన్ గొగొయ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆలోక్ వర్మపై వస్తున్న ఆరోపణలపై 10 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని తొలుత ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ కేసులో చాలా పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున దర్యాప్తునకు 10 రోజుల సమయం సరిపోదని సీవీసీ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కోర్టు మరికొంత గడువు ఇచ్చింది.