YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

కరెంట్ అఫైర్స్..

కరెంట్ అఫైర్స్..

కరెంట్ అఫైర్స్ 

రాష్ట్రీయం

1) దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కారద్యర్శులతో 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో ఎవరు ఉన్నారు ?

జ: అర్వింద్ మెహతా

2) విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత?

జ: 1800 425 3525

3) టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2018లో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి ఏ స్థానం దక్కింది ?

జ: 801-1000 లోపు ర్యాంకింగ్ లో

జాతీయం

4) సిఎస్ఇ –  సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జ: న్యూ ఢిల్లీ

5) ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలోస్ స్కీమ్ కింది ప్రతి యేటా బీలెక్, ఎంటెక్ చదువుతున్న ఎంతమందికి ఫెల్లోషిప్ లు ఇస్తున్నారు ?

జ: వెయ్యి మందికి

6) నీతి ఆయోగ్ రెండేళ్ళ పాటు CEO గా అమితాబ్ కాంత్ 17 ఫిబ్రవరి 2017న నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని ఎప్పటి దాకా పొడిగించారు?

జ: 30 జూన్ 2019

7) పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?

జ: ఆటపాక పక్షుల సంరక్షణా కేంద్రం, ఆంధ్రప్రదేశ్

8) వన్డే క్రికెట్ లో 200 వికెట్లు తీసిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరు ?

జ: ఝులన్ గోస్వామి

9) అధికారిక ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి హయ్యస్ట్ ర్యాంక్ సాధించిన ఆటగాడు ఎవరు?

జ: శుభంకర్ శర్మ

10) ఆధార్ ప్రాతిపదికగా ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తుండటంతో 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 ఫిబ్రవరి 8 వరకూ ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఆదా అయింది ?

జ: రూ.75,000 కోట్లు

(నోట్: మొత్తం 63 కోట్ల మందికి లబ్ది కలిగింది)

11) ఆన్ లైన్ సెర్చ్ విషయంలో అనైతికతకు పాల్పడిందంటూ ఏ ఇంటర్నెట్ దిగ్గజానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూ.136 కోట్ల జరిమానా విధించింది ?

జ: గూగుల్ కి

12) అంతర్జాతీయ మేధో హక్కుల (ఐపీ) సూచీలో భారత్ ర్యాంకింగ్ ఎంత ?

జ: 44వ స్థానం

13) డిజిటల్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఏ సంస్థతో NCERT ఒప్పందం కుదుర్చుకుంది?

జ: గూగుల్

14) వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2018 ఏ సిటీలో జరుగుతోంది?

జ: దుబాయ్


అంతర్జాతీయం..

15) మొదటిసారిగా క్రిప్టో కరెన్సీ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. ఇందులో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు ?

జ: క్రిస్ లారెన్స్ ( దాదాపు 8 బిలియన్ డాలర్ల ఆదాయం)

16) బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలికి అవినీతి కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆమె ఎవరు?

జ: ఖలీదా జియా

17) అమల్లో ఉన్న సేమ్ సెక్స్ మ్యారేజీ చట్టాన్ని రద్దు చేసిన మొదటి దేశం ఏది?

జ: బెర్ముడా

 

IMP GK & CA BITS

■1). ఈబీసీలకు కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోంది. ప్రస్తుతం ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు ?

జ: 75 వేలు

■2). ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ-ఫైబర్ ప్రాజెక్టు పూర్తయితే సెకనుకు ఎంత జీబీ వేగంతోకూడి బ్రాడ్ బ్యాండ్ అందుబాటులోకి రానుంది ?

జ: ఒక జీబీ

■3).  దేశంలోనే ప్రైవేటు రంగంలో అతిపెద్ద విద్యుత్తు సరఫరా ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

జ: ఉత్తర ప్రదేశ్

■4).  హిందూస్తాన్ ఏరో నాటిక్స్ సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ( RTOS) ను బిగించిన విమానం విజయవంతంగా ఎగిరింది. ఆ విమానం పేరేంటి ?

జ: హక్ విమానం

■5).  స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని శాస్త్రవేత్తలు ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు?

జ: 350 కిమీ.
 (నోట్: 500 నుంచి వెయ్యి కిలోల బరువున్న అణఉ వార్ హెడ్స్ మోసుకెళ్లగలదు)

■6).  హెవీ పేలోడ్స్ మోసుకెళ్ళే రాకెట్ లో టెస్లా కంపెనీ కారును అంతరిక్షంలోకి పంపిన అమెరికాకి చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఏది ?

జ:  స్పేస్ ఎక్స్

■7). జన సమూహంలో నక్కిన నేరగాళ్లని పసిగట్టే హైటెక్ కళ్ళద్దాలను ఏ దేశం అభివృద్ది చేసింది ?

జ: చైనా

■8).  బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎవరు మరోసారి ఎన్నికయ్యారు ?

జ: అబ్దుల్ హమీద్

■9). 11 దేశాల శరణార్థులపై గతంలో విధించిన నిషేదాన్ని తాజాగా ఏ దేశం ఎత్తివేసింది.?

జ: అమెరికా

■10). 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అంచనా..?

జ: 7.4 శాతం

Related Posts