వంశపారంపర్య అర్చక సర్వీసు మరియు సేవలు కొనసాగింపుకు సంబంధించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కే.ఈ.క్రిష్ణమూర్తి ఆదేశించారు.పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మార్గదర్శక సూత్రాలు తయారు చేయాలని, మార్గదర్శక సూత్రాలు రూపొందించుదుకు రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి నేత్రుత్వంలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నలుగురు సభ్యులున్న ఈ కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు వ్యవహరిస్తారు. కమీషనర్ ఎండోమెంట్ మెంబర్ కన్వీనర్ గా, లా సెక్రెటరీ, ఎచ్డపిటి ఛైర్మన్ ,బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు.చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, పూజారులతో పాటు ఏపీ అర్చక సమాఖ్య అభ్యర్ధన మేరకు వంశపార్యంపర అర్చకత్వానికి సంబంధించి దేవాదయ శాఖ కమీషనర్ నుంచి ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. కమీషనర్ నివేదిక ఆధారంగా ఎండో మెంట్ చట్టం లోని 34 మరియు 144 సెక్షన్ల తో పాటు సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని మార్గదర్శక సూత్రాలను తయారు చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించిందన్నారు. రెండునెలల్లో నివేదిక అందజేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమీషనర్ కు ఆదేశించామన్నారు.