YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సీనియర్ జర్నలిస్ట్ కైసర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి

సీనియర్ జర్నలిస్ట్ కైసర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి

- మరో జర్నలిస్టు వ్యధాభరిత జీవితం 

- అక్రిడేషన్లకు సంక్షేమ పథకాలకు లింకు తీసెయ్యాలి


- జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చెయ్యాలి.

- జర్నలిస్టు సంఘాలు  రాజకీయాలు  విడనాడాలి 

- సామాన్య జర్నలిస్టుల సంక్షేమాన్ని చూడండి.. 


కైసర్ సీనియర్ జర్నలిస్టు. అందరికి తెలిసిన జర్నలిస్టు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి జర్నలిస్టుగా ఎదిగిన జర్నలిస్టు బిడ్డ.  వృత్తి పరమైన వత్తిడులు కావచ్చు. జీవన పరమైన వత్తిడులు కావచ్చు కైసర్ కిడ్నీలు పాడై పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. కైసర్ గురించి తెలియని జర్నలిస్టు నాయకుడు లేడు. మరి నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పత్రికలో వచ్చే వరకు పరిస్థితి వచ్చింది. తమ వ్యక్తిగత అవసరాలకు ముఖ్యమంత్రి గారితో ముచ్చట్లు పెట్టే నాయకులకు కైసర్ భాయి గురించి పెద్దాయనతో చర్చించలేక పోయారా... లేక సామాన్య జర్నలిస్టు సంకనాకిపోతే నాకేమిటి అనుకుంటున్నారు..వందకోట్ల నిధి అంటూ ఊదర కొట్టే నాయకులారా.. ఆ నిధి డైరక్టుగా జర్నలిస్టుల సంక్షేమానికి ఉపయోగించుకోలేము.. దానిద్వారా వచ్చే మిత్తీ  పైననే మన సంక్షేమం ఆధార పడి ఉంది అని నెత్తీ నోరు కొట్టుకుని చెబుతున్నా జర్నలిస్టు సోదరుల మభ్య పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు కైసర్ భాయ్ పరిస్థితిని ముఖ్యమంత్రి గారో, కేటీఆర్ గారో చూసి చలించి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి గురించో ఇంకోదాని గురుంచో స్పందిస్తే తప్ప కైసర్ భాయ్ బ్రతుకు బాగు పడదు. ఆయన పరిస్థితి అలాగా ఉంటే ఆయన గూర్చి ఫేసు బుక్ లలో పెట్టి పేపర్లలోపెట్టి ఆయన అకౌంట్ నంబర్లు ఇచ్చి, మా సంఘం ఆయన కుటుంబానికి సహాయ పడుతున్నది. మీరు దయార్ధ్ర హృదయంతో స్పందించండి అంటూ సిగ్గు మాలిన రాజకీయాలకు తెరతీసి కైసర్ భాయ్ జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు...
 జర్నలిస్టు మితృలారా... ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రంలో జర్నలిస్టుల పేర ఇప్పుడు జరుగుతున్నది వింత నాటకం. ఈ నాటకంలో మన అమాయక జర్నలిస్టులము బలి అవుతున్నాము. జరుగుతున్న తతంగాన్ని చూడండి..
ఇప్పుడు అక్రిడేషన్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లింక్ పెట్టారు. కాబట్టి అక్రిడేషన్లు ఉన్న జర్నలిస్టులకే అన్ని అవకాశాలు . కాబట్టి అక్రిడేషన్ అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో అమెరికా వీసా కంటే ఎక్కువ విలువైంది.
మనకు ఉన్న ఉజ్జాయింపు సమాచారం ప్రకారం వేలాది మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు రాలేదు. అందులో సామాన్య జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. జర్నలిస్టు నాయకులతో టచ్ లో ఉన్న జర్నలిస్టులు ఏదో ఒక విధంగా కార్డులు తెచ్చు కున్నారు. కాని సామాన్య జర్నలిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
ఇక చిన్న పత్రికల పరిస్థితి చెప్పనలవి కాదు. పత్రిక నడిపే ఎడిటర్ కు సైతం కార్డు రాలేదు. ఇక మిగతా వారి పరిస్థితి సరేసరి. 
హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే.. జర్నలిస్టు నాయకుల వద్దకు కాళ్ళు అరిగేలా తిరిగాలి. ఒకటో అరో కార్డులు వస్తే ఇగ అదేదో గొప్ప విషయం అన్నట్లు సోషల్ మీడియాలో ఊదరగొట్టే పోస్తింగులు తమ వందిమాగధులతొ ఓకేలు షేర్ లు.
ఆ మాటకొస్టే మన జర్నలిస్టు సంఘాల నాయకులందరూ చిన్న పత్రికల వారే...
కార్డులు లేకున్నా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి యాడాది దాటి పాయే దాని జీవో బయటికే రాకపాయే.. మరి కష్టాలు తీరేదెలా.. జర్నలిస్టుకు బాధలు వచ్చినపుడు ప్రతి సారి ముఖ్యమంత్రి వారి వద్దకు వెళ్ళడం కుదరదు కదా... అందుకే లక్షా యాభై వేల కోట్ల బడ్జేట్ లో సంవత్సరానికి కనీసం ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. ఎందుకంటే ఈ రంగం పై ఆధారపడి సుమారు యాభైవేల కుటుంబాలు జీవిస్తునాయి. వీరిని పాత్రికేయులుగా కాకున్నా ఒక ప్రత్యేక సెక్టార్ గా నైనా గుర్తించి ఈ నిర్ణయం ప్రభ్తుత్వం తీసుకోవాలి. ఈ బడ్జెట్ ద్వారా పాత్రికేయులకు న్యాయం జరిగే వీలుంది.
 అప్పుడు ఈ పరిస్థిత్ ఎదురయ్యే ప్రతి జర్నలిస్టు జీవితాలకు కనీసం గౌరవ ప్రదమైన ముగింపు ఉంటుందని ఆశ.


జర్నలిస్టు సంక్షేమం పట్ల జర్నలిస్టులందరితో కలిసి ముఖ్యమంత్రి  లేదా కేటీఆర్ గారు ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అవ్వాలి. 
ఆయా పత్రికలు, మీడియాలు ప్రభుత్వం ప్రకటనలో సెస్ రూపంలో కట్ చెయ్యాలి అన్న నిబంధన ఉన్నది. మరి దానిని వెంటనే అమలు పరచాలి. యాజమాన్యాలు కూడా ఆదాయంలో  తమతమ సిబ్బంది సంక్షేమం చూసుకోవాలి.
వెంటనే కైసర్ భాయ్ కిడ్నీ మార్పిడికి ప్రభుత్వం సహాయం చెయ్యాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురయ్యే ప్రతి జర్నలిస్టు సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలా నిధి కాకుండా ప్రత్యక్ష బడ్జెట్ ను కేటాయించాలి.
అన్ని పత్రికలు ఎంపానెల్మెంట్ చెయ్యాలి. ఏబీసీడి వర్గీకరణ తీసెయ్యాలి. ప్రతి పత్రికకు (తెలంగాణా బిడ్డగా) ప్రతి నెలా కనీసం లక్ష రూపాయల ప్రకటన ఇవ్వాలి. వారి ప్రచురణల విషయంలో ఏవైనా ఇబ్బందులుంటే ఆయా వాటి విషయంలో తగు చర్యలు తీసుకోవచ్చు. కాని సమైక్య రాష్ట్రంలో నిరాధరణకు గురైన పత్రికలపై అప్పటికంటే ఎక్కువ నిబంధనలు పెట్టి మూలిగే నక్కపై తాటికాయ చందంగా జర్నలిస్టుల జీవితాలతో చెలగాటమాడవద్దు..
ప్రభుత్వమా ఆలోచించు... ఆ పదిమంది పాత్రికేయ నాయకులే  మీ ప్రభుత్వాన్ని గట్టెక్కించరు...
సామాన్య జర్నలిస్టుల సంక్షేమాన్ని చూడండి.. 
జర్నలిస్టు సంఘాల నాయకులు ఇప్పటికైనా కైసర్ భాయ్ తో పాటుగా ఇతర  సామాన్య జర్నలిస్టుల జీవితాల కోసం కలిసికట్టుగా ముఖ్యమంత్రి వద్ద చర్చించాలి. పని చేయించాలి.

Related Posts