ఒకప్పటి పదును కోల్పోయి, ఫామ్‌తో సతమతమవుతున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వేటు పడింది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో తలపడే 16 మంది సభ్యుల భారత టీ20 జట్ల నుంచి సెలక్షన్ కమిటీ అతణ్ని తొలగించింది.కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల మద్దతు ఉన్నప్పటికీ తన ను పక్కనబెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో ధోనీ కెరీర్ ముగిసినట్టే అని కథనాలు వినిపిస్తుండగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం వీటిని ఖండించారు. ‘ధోనీ ఆరు టీ20ల్లో ఆడడం లేదు. మేం సమర్థుడైన రెండో వికెట్‌కీపర్ కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకానీ అతడికి ద్వారాలు మూసుకుపోలేదు’ అని స్పష్టం చేశారు. అందుకే రిషభ్ పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌లను ఈ ఆరు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు సెలక్టర్లు కెప్టెన్ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐతే ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు, టీ20 జట్లకు కోహ్లినే సారథిగా ఉంటాడు. ఇంగ్లాండ్‌లో విఫలమై టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన మురళీ విజయ్ తిరిగి ఆసీస్‌తో టెస్టులకు ఎంపికయ్యాడు. హనుమ విహారికి మరో అవకాశం దక్కింది.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, దినేశ్ కార్తీక్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్.
ఆస్ట్రేలియాతో టెస్టులకు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పృథ్వీ షా, పుజారా, రహానె, విహారి, రోహిత్, పంత్, పార్థివ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), కుల్‌దీప్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్, ఖలీల్ అహ్మద్.