- పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు విరామం
- లోక్‌సభ, రాజ్యసభలకు మార్చి 4 వ తేదీ వరకు విరామం
- మొదటిదశ బడ్జెట్ భేటీ పూర్తి.
- వచ్చే నెల 5 వతేదీకి ఉభయ సభలు వాయిదా .
- లోక్‌సభ, రాజ్యసభలకు మార్చి 4 వ తేదీ వరకు విరామం
రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. గత నెల 29న రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రంసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగించినా...భారత జీడీపీ వృద్ధి దిశలో కొనసాగుతోందని చెప్పారు. విదేశీమారక ద్రవ్య నిల్వలు 410 బిలియన్ డార్లకు చేరుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ఘన కార్యాలను ఉదహరించారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టామని చెప్పిన రాష్ట్రపతి, జీఎస్‌టీ అమలు ఆర్థిక సంస్కరణ పథంలో ముందడుగన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగం రోజే 2018-19 ఆర్థిక సర్వేని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏడు నుంచి ఏడున్నర శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
రూ.24 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పద్దులు
ఆ తర్వాత ఈనెల 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 వార్షిక బడ్జెట్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మొత్తం 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారీ పద్దులతో సమర్పించిన బడ్జెట్‌లో రైల్వేలకు 1.48 లక్షల కోట్లు కేటాయించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు, రాజ్యసభలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఐదు రోజుల పాటు నిరసన తెలిపారు. ఏపీ ఎంపీల నిరసన మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీ పునర్విభజన బిల్లును ఆమోదించిన అప్పటి యూపీఏ తీరును మోదీ ఎండగట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ఏపీ ఎంపీలు... బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ ఎంపీల నిరసనల మధ్య పార్లమెంటు మొదటి దశ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.