ఎర్ర చందనం దొంగలు మరోసారి హల్ చల్ చేసారు. శనివారం తెల్లవారుజామున భీమవరం బీట్ లో కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి భారీ సంఖ్యలో స్మగ్లర్లు ఎదురుపడ్డారు. వెంటనే పోలీసులపై స్మగ్లర్లు దాడికి ప్రయత్నించారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గొడ్డళ్లు, రంపాలు, గునపాలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక ఫారెస్ట్ బీటు అధికారి కోదండ గాయపడ్డాడు. సమాచారం అందగానే ఘటన స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. గాయపడిన ఎఫ్ బివోను ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు జవ్వాదిమల్లైకి చెందిన నులుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో నుంచి 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.