రక్తం తాగే నరమాంస భక్షకులు.. ప్రాణాలు తీసే రాక్షసులు.. భయంకర రూపాలు.. భయానక సన్నివేశాలు.. ఎటుచూసినా రక్తం.. ఎవరిని పలకరించాలన్నా భయం.. భయం. ఈ భయం ముంగిట్లో ఆసక్తిరేపే విధంగా మెగా ఫ్యామిలీ మొత్తం దెయ్యాలు, భూతాలుగా మారి హడలెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ‘హాలోవీన్’ ఇది నయా ట్రెండ్. పాశ్చాత్య దేశాల్లో పాపులర్ అయిన ‘హలోవీస్’ పార్టీని ప్రముఖుల ఇళ్లల్లో ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తుంది. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా మెగా ఫ్యామిలీ ఈ ‘హాలోవీన్’ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి రాక్షసుడి అవతారం కనిపించగా.. మిగిలిన కుటుంబ సభ్యులు అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శ్రీజ, సుస్మిత, నిహారిక, ఉపాసనలతో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులు, పిల్లలు దెయ్యాలు, భూతాలుగా సందడి చేశారు. వీటిలో ముఖ్యంగా రామ్ చరణ్ భార్య ఉపాసన దెయ్యంగా మారి తన అత్తగారు, చిరంజీవి భార్య సురేఖను భయపెడుతున్న ఫోటో ఆకట్టుకునేదిగా ఉంది. అయితే రామ్ చరణ్ స్వామి మాలలో ఉండటంతో ‘హాలోవీన్’ మేకప్‌కి దూరంగా ఉన్నా.. సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.