YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష

మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం తమపై కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఏపీ విభజన హామీల అమలు చేయాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా అమలుపై పోరాటంలో భాగంగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన టీడీపీపై కేంద్రం వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిపై మాట్లాడుతూ.. ‘‘కేంద్రం పరిధిలోని సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న విమానాశ్రయంలో ఒకరిపై దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. ఈ ఘటన తర్వాత బాధితుడు (జగన్) నేరుగా హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని వివరణ కోరాల్సిన గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేసి అడిగారు. శివాజీ అనే నటుడు ఆపరేషన్ గరుడా గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ, అందులో చెప్పినట్లే ఇప్పుడు జరుగుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతిపక్ష నేతపై దాడి, ఐటీ దాడులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది’’ అని తెలిపారు. దాడి తర్వాత జగన్ హైదరాబాద్ వెళ్లి, తనకు చాలా దెబ్బ తగిలిందంటూ హడావిడి చేశారు. బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. మరోవైపు గవర్నర్ కూడా ఈ విషయంలో కలుగజేసుకున్నారు. పాలన వ్యవహారాల్లో గవర్నర్ కలుగజేసుకోవచ్చా? ఇక్కడ ఉండే గవర్నర్‌లు కేంద్రానికి సీక్రెట్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి గవర్నర్ ఏపీని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ మీకు సపోర్ట్ చేయండి, కాదనను. కానీ, మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఆ ఘటన జరిగింది విమానాశ్రయంలో. అక్కడ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యతవహించాలి? బాధ్యత గల నాయకుడిగా ఆయన సీఐఎస్ఎఫ్ లేదా రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈ ఘటనపై గవర్నర్ ఇక్కడికి వచ్చి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారో తెలీదు. కానీ, నిజం దాగితే దాగిపోదు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నిజాలు తెలుస్తాయి’’ అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌తంత్రిక్ జనతాదళ్ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కెజ్రీవాల్‌తో ఆయన ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం తీరును వారికి వివరించారు.  జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటనపై ఏపీభవన్‌లో జరిగే విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయకుండా కేంద్రం ఏపీని కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుండటం, టీడీపీ లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. సీబీఐ, రాఫేల్‌ కుంభకోణాలు తదితర అంశాలను జాతీయ మీడియాకు వివరించనున్నారు. ఈ సందర్భంగా ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ’ పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇవ్వనున్నారు.

Related Posts