YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం లో మంత్రి పరిటాల సునీత

పోలవరం లో మంత్రి పరిటాల సునీత

రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానంతో మహా సంగమానికి శ్రీకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత అన్నారు. పోలవరం ప్రోజెక్టును అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సుమారు 700 మంది రైతులతో శనివారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. కృష్ణా- గోదావరి నదులనే కాక రాష్ట్రంలోని వంశదార నుండి పెన్నా నదుల వరకు అన్ని నదుల అనుసంధానంచేసి మహా సంగమ కార్యక్రమంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపర భగీరధుడయ్యారన్నారు. 6 కోట్ల ఆంద్రుల కల పోలవరమని, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొక్కవోని దీక్షతో పోలవరం ప్రోజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సంకల్పం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలో గత నాలుగన్నరేళ్లలో పోలవరం ప్రోజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయని, ఇంతవరకు 60 శాతం పనులను పూర్తయ్యాయన్నారు. మట్టిపనులు 80 శాతం, కాంక్రీట్ పనులు 42 శాతం, రేడియల్ గేట్ల పనులు 62 శాతం పూర్తయ్యాయన్నారు. పోలవరం ప్రోజెక్టు తెలుగు ప్రజల జీవనాడి అన్నారు. పట్టిసీమ ప్రోజెక్టును రికార్డు సమయంలో నిర్మించామని, పట్టిసీమ కారణంగా గోదావరి జలాలు కృష్ణా డెల్టాను సస్యశ్యామలంచేస్తే, శ్రీశైలం ద్వారా కృష్ణమ్మ నీళ్లు రాయలసీమను సస్యశ్యామలం చేశాయన్నారు. నీరు-చెట్టు, పంట సంజీవని కుంటల వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తరలించి రాయలసీమలో కరువు పరిస్థితులను ముఖ్యమంత్రి తరిమికొట్టారన్నారు.

Related Posts