టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు చంద్రపాల్(15; 20బంతుల్లో 2×4, 1×6), కీరన్ పావెల్(21; 25బంతుల్లో 2×4, 1×6) పేస్ బౌలర్ బుమ్రా వెంటవెంటనే ఔట్ చేసి విండీస్‌ను కట్టడి చేశాడు. అనంతరం కెప్టెన్ హోల్డర్(32; 39బంతుల్లో 2×4, 1×6)తో జత కలిసిన హోప్(95; 113బంతుల్లో 6×4, 3×6) నిదానంగా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ జోడీ అనవసరపు షాట్లకు పోకుండా ఆచితూచి ఆడుతూ వచ్చారు. కానీ హోల్డర్ కుదురుకునే సమయంలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద జడేజాకు చిక్కాడు. ఆ తర్వాత కాసేపు హోప్ మెరిపించినా.. అతనిని కూడా బుమ్రా 44ఓవర్‌లో బౌల్డ్ చేయడంతో విండీస్ స్కోరుబోర్డు ఆఖర్లో నిదానించింది. చివర్లో నర్స్(40; 21బంతుల్లో 4×4, 2×6) మెరిపించడంతో విండీస్ భారత్ ముందు 284పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.