ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 'ఏపీ డీఎస్సీ - 2018' నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని మొత్తం 7,729 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో 4,341 పోస్టులు; మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1,100 పోస్టులు; ఆదర్శ పాఠశాలల్లో 909 పోస్టులు; గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175, బీసీ సంక్షే పాఠశాలల్లో 404 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 6 నుంచి 2019 జనవరి 2 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1 నుంచి 16 వరకు కొనసాగనుంది. నవంబరు 15 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డీఎస్సీ-2018 పరీక్షలకు సంబంధించిన తేదీలు, మార్కుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. * స్కూలు అసిస్టెంట్ (ఎస్ఏ), భాషాపండితులు పోస్టులకు..
స్కూలు అసిస్టెంట్లు, భాషాపండితులకు 80 మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష ఉంటుంది. టెట్ వెయిటేజీ 20 మార్కులు ఉంటాయి.
సబ్జెక్టు మార్కులు
జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు 10
విద్యా దృక్పథాలు (పర్స్పెక్టివ్స్) 05
తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వ శాస్త్రం(సైకాలజీ) 05
కంటెంట్ 40
బోధన శాస్త్రం(మెథడాలజీ) 20
మొత్తం మార్కులు 80
* సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకు..
ఈసారి డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో టెట్, టీఆర్టీ కలిపి నిర్వహిస్తున్నారు. 100 మార్కుల్లో అభ్యర్థి సాధించిన మార్కులను 20 శాతానికి లెక్కించి వాటిని టెట్ మార్కులుగా నిర్ణయిస్తారు.
సబ్జెక్టు మార్కులు
జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు 10
విద్యా దృక్పథాలు (పర్స్పెక్టివ్స్) 05
విద్యా మనస్తత్వ శాస్త్రం 10
లాంగ్వేజ్ కంటెంట్, మెథడాలజీ 15
లాంగ్వేజ్-2 కంటెంట్, మెథడాలజీ 15
మ్యాథమెటిక్స్ కంటెంట్, మెథడాలజీ 15
జనరల్ సైన్స్ కంటెంట్, మెథడాలజీ 15
సోషల్ కంటెంట్, మెథడాలజీ 15
మొత్తం మార్కులు 100
* వ్యాయామ ఉపాధ్యాయులు పోస్టులకు..
వ్యాయమ ఉపాధ్యాయ పోస్టులకు 80 మార్కులకు నియామక పరీక్ష ఉంటుంది.
సబ్జెక్టు మార్కులు
జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు 05
విద్యా దృక్పథాలు (పర్స్పెక్టివ్స్) 05
వ్యాయామ విద్యా బోధన(పెడగోజీ) 10
కంటెంట్ 30
శారీరక సామర్థ్య పరీక్ష 30
మొత్తం మార్కులు 80
* మ్యూజిక్ టీచర్ పోస్టులకు
రాతపరీక్ష 70
నైపుణ్య పరీక్ష 30
మొత్తం మార్కులు 100 మార్కులు
* క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ పోస్టులకు..
క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ పోస్టులకు 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
* ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు..
ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు 100 మార్కులకు ఇంగ్లిష్ స్క్రీనింగ్ పరీక్ష (పేపర్-1) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే పేపర్-2ను పరిగణనలోకి తీసుకుంటారు. రెండు పేపర్లు కలిపి 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
ప్రిన్సిపల్ పోస్టులకు..
సబ్జెక్టు మార్కులు
జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు 15
విద్యా దృక్పథాలు (పర్స్పెక్టివ్స్) 15
విద్యా మనస్తత్వ శాస్త్రం 20
పర్యవేక్షణ, నాయకత్వం, పరిపాలన, సాంఘిక, ఆర్థిక, సంస్కృతి కంటెంట్ 35
మెథడాలజీ అవగాహన 15
మొత్తం మార్కులు 100
పీజీటీ నియామక పోస్టులకు...
సబ్జెక్టు మార్కులు
జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు 10
విద్యా దృక్పథాలు 10
విద్యా మనస్తత్వ శాస్త్రం 10
కంటెంట్ 50
మెథడాలజీ 20
మొత్తం మార్కులు 100
టీజీటీ పోస్టులకు...
టీజీటీ పోస్టులకు 100 మార్కులకు ఇంగ్లిష్ స్క్రీనింగ్ పరీక్ష (పేపర్-1) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే పేపర్-2ను పరిగణనలోకి తీసుకుంటారు. రెండు పేపర్లు కలిపి 180 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ టెట్కు 20% వెయిటేజీ ఉంటుంది.
సబ్జెక్టు మార్కులు
జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు 10
విద్యా దృక్పథాలు 05
తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వ శాస్త్రం 05
కంటెంట్ 40
మెథడాలజీ 20
మొత్తం మార్కులు 80
ముఖ్యమైన తేదీలు ఇలా...
* డీఎస్సీ షెడ్యూలు
సందర్భం తేదీలు
డీఎస్సీ నోటిఫికేషన్ 26.10.2018
ఫీజు చెల్లింపు 01.11.2018 - 15.11.2018
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 01.11.2018
దరఖాస్తుకు చివరితేది 16.11.2018
పరీక్ష కేంద్రాల ఎంపిక 19.11.2018 - 24.11.2018
ఆన్లైన్ మాక్ టెస్ట్ 17.11.2018
హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ 29.11.2018 నుంచి
* పరీక్షల షెడ్యూల్
పరీక్షలు తేదీలు
ఎస్ఏ (నాన్ లాంగ్వేజెస్) 06, 12.12.2018
ఎస్ఏ (లాంగ్వేజెస్) 11.12.2018
పీజీటీ 12, 13.12.2018
టీజీటీ, ప్రిన్సిపాల్ 14, 16.12.2018
పీఈటీ, ఆర్ట్స్, మ్యూజిక్, క్రాఫ్ట్స్ 17.12.2018
లాంగ్వేజ్ పండిట్స్ 27.12.2018
ఎస్జీటీ 28.12.2018 - 02.01.2019
* పరీక్ష కీ, అభ్యంతరాల స్వీకరణ..
విభాగం ప్రాథమిక కీ అభ్యంతరాలు తుది కీ
ఎస్ఏ 12.12.2018 12-14.12.2018 18.12.2018
పీజీటీ 14.12.2018 14-16.12.2018 20.12.2018
పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ 18.12.2018 18-20.12.2018 22.12.2018
టీజీటీ, ప్రిన్సిపాల్ 27.12.2018 27-29.12.2018 02.01.2019
లాంగ్వేజ్ పండిట్ 28.12.2018 28-30.12.2018 03.01.2019
ఎస్జీటీ 03.01.2019 03-06.01.2019 10.01.2019
* ఫలితాలు, మెరిట్ జాబితా
విభాగం ఫలితాలు మెరిట్ లిస్ట్ ప్రాథమిక ఎంపిక జాబితా
ఎస్ఏ 20.12.2018 22.12.2018 24.12.2018
పీజీటీ 22.12.2018 24.12.2018 26.12.2018
పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ 24.12.2018 26.12.2018 28.12.2018
టీజీటీ, ప్రిన్సిపాల్ 04.01.2019 06.01.20190 08.01.2019
లాంగ్వేజ్ పండిట్ 05.01.2019 07.01.2019 09.01.2019
ఎస్జీటీ 12.01.2019 14.01.2019 16.01.2019