YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిందితుడు శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్!

 నిందితుడు శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుడిని  ఈ రోజు కోర్టు ముందు హాజరుపర్చగా, వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించింది.శ్రీనివాసరావును విచారించేందుకు వీలుగా తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తికి న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ పట్నం సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాసరావును మరికాసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. జగన్ పై దాడికి ఎవరు పురిగొల్పారు? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? విజయలక్ష్మీ, చైతన్య అనే స్నేహితుల సాయం తీసుకుని ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? వంటి విషయాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. అలాగే 11 పేజీల లేఖపై సైతం పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.

Related Posts