YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

8 వేలకే బెజవాడ టూ సింగపూర్

8 వేలకే బెజవాడ టూ సింగపూర్

విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4నుంచి విమాన సర్వీసులు నడపనున్నట్టు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు క్లియరెన్స్‌ రిపోర్టు ఇవ్వడంతో పాటు సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టింది. తొలుత వెబ్‌పోర్టల్‌లో రూ.8,112గా ఉన్న ప్రారంభ ధర గంట తర్వాత రూ.7,508కి తగ్గింది. విజయవాడ నుంచి 180సీట్లతో కూడిన ఎయిర్‌బస్‌ 320, 321 నాన్‌స్టాప్‌ విమాన సర్వీసును అందుబాటులోకి తేనుంది. మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.40గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విమానం తెల్లవారుజామున 2గంటలకు సింగపూర్‌ చేరుకుంటుంది.ఏడాదిన్నర కిందట గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం అంతర్జాతీయ హోదాను కల్పించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు గాలిలోకి లేస్తాయని ప్రకటించారు. కానీ.. అనేక ఆటంకాలను దాటి ఇన్నాళ్లకు అంతర్జాతీయ కలను సాకారం చేసుకునే రోజొచ్చింది. ఈనెల 25నే సింగపూర్‌కు తొలి సర్వీసును నడపాలని అధికారులు భావించినా.. కస్టమ్స్‌ అనుమతుల జాప్యంతో వాయిదా పడింది. డిసెంబర్‌ 4వ తేదీకి వాయిదా వేశారు. ఇండిగో తన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాన్ని ఆరంభించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నాలుగున్నర గంటల్లో చేరిపోయేలా శీతాకాల షెడ్యూల్‌ను ఇండిగో ప్రకటించింది.విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు, అటు నుంచి వచ్చేందుకు వారంలో రెండు రోజులు అక్కడ, ఇక్కడ అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వచ్చాయి. రూ.18వేల లోపే సింగపూర్‌కు వెళ్లి వచ్చేందుకు టిక్కెట్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగపూర్‌కు విమాన సర్వీసును డిసెంబర్‌ 4 నుంచి నడపనున్నట్టు ఇండిగో సంస్థ క్లియరెన్స్‌ ఇచ్చి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టడంతో గత అర్థ సంవత్సరకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంబన ఎట్టకేలకు వీడింది. అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా, విదేశానికి విమానం ఎగరలేదన్న అపప్రద కూడా తొలగిపోయింది. సింగపూర్‌కు విమాన సర్వీసు బుకింగ్‌ కాగానే మనవాళ్ళు ఉత్సాహంతో బుకింగ్‌ చేసుకుంటున్నారు. వాస్తవానికి సింగపూర్‌ కంటే దుబాయ్‌కు మన దగ్గర నుంచి డిమాండ్‌ బాగా ఉంది. దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు నడపాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉండటంతో ఈ సర్వీసుపై కూడా ఆశలు కలుగుతున్నాయి.

Related Posts