గత ఆర్ధిక సంవత్సరానికి పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.1490.4 కోట్లు నికర నష్టానికి నమోదు చేసింది. 2016-17 లో నష్టం రూ.879.6 కోట్లే కావడం గమనార్హం. కార్యకలాపాల ఫై ఆదాయం మాత్రం రూ.624.76 కోట్లు నుంచి భారీగా పెరిగి రూ.2987.41 కోట్లకు చేరింది. పేటీఎం మాల్ ను నిర్వహించే పేటీఎం ఇకామర్స్ 2017-18 లో రూ.1787.55 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.2016-17 లో ఈ సంస్థ నష్టం రూ.13 .63 కోట్లే.