YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్డీయే బయటకు వచ్చాకే ఐటీ దాడులు - సీఎం చంద్రబాబు నాయుడు

 ఎన్డీయే బయటకు వచ్చాకే ఐటీ దాడులు - సీఎం చంద్రబాబు నాయుడు

రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయి.  మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరాం. కానీ మంచి  జరగలేదు కాబట్టే బైటకు వచ్చాం. ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలి. తన ప్రత్యర్ధులను కట్టడి చేయడానికి వ్యవస్థలను వాడుకోవడం సరైందికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం అయన నీరు-ప్రగతి పురోగతిపై జరిగిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆశలే మనకు ముఖ్యం. మనం ధర్మం కోసం అడిగితే మనపై పోరాటాలు చేస్తామనే ధోరణి మంచిదికాదు. ఎన్డీఏలో ఉన్నంతకాలం మనపై ఐటి దాడులు లేవు.బైటకొచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సిబిఐ లో పరిణామాలు దేశానికి అప్రతిష్ట తెచ్చాయి. కేంద్రం ఇబ్బందులు పెట్టి డిమోరలైజ్ చేయాలని చూసింది. అది పొరబాటే అని మన సామర్ధ్యంతో రుజువు చేశాం. ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేతపై  దాడిపై దుష్ప్రచారం జరిగింది. ఆయన అభిమాని దాడికి రాష్ట్రప్రభుత్వానికి ముడిపెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అంటకడుతున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ. ప్రతిపక్షం అడ్డంకులు,కుట్రలు. అన్నింటినీ అధిగమిస్తున్నాం. మన స్వయంకృషితో అభివృద్ధి ఆగకుండా చూశాం. వినూత్న ఆలోచనలతో సత్ఫలితాలు పొందుతున్నాం. నీరు-ప్రగతి, నరేగా కన్వర్జెన్స్ అందుకు ఉదాహరణ అని అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం  వర్షపాతం లోటు ఉంది. మూడు జిల్లాలలో( శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి) తప్ప అన్ని జిల్లాలలో లోటు ఉంది. నవంబర్ 1నుంచి ఈశాన్య రుతు పవనాల ప్రభావం అధికం. 3వ తేది వరకు వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, కడప జిల్లాలలో 6వ తేది వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఖరీఫ్ లో 91 శాతం సేద్యం జరిగింది. రబీలో కూడా సేద్యం ముమ్మరంగానే జరగనుంది. దానికి తగ్గట్లుగా ఇన్ పుట్స్ అందుబాటులోకి వుంచాలి. రబీలో విత్తనాలు, ఎరువులు, పంటరుణాల కొరత లేకుండా చూడాలి. కౌలురైతులకు రూ.3,425కోట్లు పంటరుణాలు ఇచ్చాం. రబీలో కలిపి అయిదారు వేల కోట్లు ఇవ్వాలి. దేశంలోనే ఇంత పెద్దఎత్తున కౌలు రైతులకు రుణాలు ఒక రికార్డు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో దేశంలోనే ముందున్నాం. ఆహార శుద్ధి పరిశ్రమల్లో మనమే ముందుండాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే ఏపికి జవం,జీవం. మనకు ప్రతిఏటా 541టిఎంసిల నీటి అవసరం ఉంది. ఉపరితల,భూగర్బ జలాలు 59% ఉంటాయి. ఇంకా 260 టిఎంసిల అవసరం ఉంది. కొరత ఉన్న నీటిని మైనర్ ఇరిగేషన్ ద్వారా పెంచుకోవాలి. భూగర్భజలాలు ఇంకా 9.8 మీటర్లు దిగువన ఉన్నాయి. ఈ పది రోజుల్లో 382 కాస్ కేడ్ల పనులు పూర్తి చేయాలి. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఫలితం కనిపించాలని అన్నారు. పరిశ్రమల నీటి అవసరాలు తీరుస్తున్నాం. ఉద్యాన పంటల నీటి అవసరాలకు సిద్దంగా ఉన్నాం.ఇక వ్యవసాయ పంట నీటి అవసరాలే తీర్చగలగాలి. అందుకు తగ్గట్లుగా జల సంరక్షణ చర్యలు చేపట్టాలి. పంటలపై తెగుళ్లను పూర్తిగా నివారించాలి. నాణ్యమైన పంట ఉత్పత్తులకు ఏపి చిరునామా కావాలి. 295 కరవు మండలాల్లో మరో 3.5కోట్ల పనిదినాలు వస్తాయి. వీటితో కలిపి నరేగా పనిదినాలు 25.5కోట్లకు చేరతాయి. ఈ ఏడాది నరేగా నిధులు రూ.11వేల కోట్లు వినియోగించాలి. త్వరలోనే మరో 2లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు. ప్రతిరోజూ 1000 ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి.అక్టోబర్ లో 27వేల ఇళ్ల నిర్మాణం పూర్తి. ప్రతి నెలా 30వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. గ్రామాల్లో 13.5లక్షల ఇళ్ల లక్ష్యం చేరాలి. రూరల్ హవుసింగ్ 80వేల ఇళ్లు వెంటనే గ్రవుండింగ్ చేయాలి. పట్టణాలలో కూడా హవుసింగ్ పనులు ముమ్మరం చేయాలని అన్నారు. మార్చికల్లా అంగన్ వాడి భవనాల నిర్మాణ లక్ష్యం చేరుకోవాలి. డిసెంబర్ కల్లా 2500 భవనాలు పూర్తి చేయాలి. దేశవ్యాప్తంగా వచ్చిన అవార్డులే మన సామర్ధ్యానికి కొలమానం.ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయాలి. మనం చేసేది సక్రమం అయినప్పుడు ఎవరికీ భయపడాల్సింది లేదని అన్నారు. సకాలంలో స్పందిస్తే ఏవిధమైన ఇబ్బందులు ప్రజలకు ఉండవు. సకాలంలో స్పందిస్తే అంటువ్యాధుల బెడద ఉండదు.  కర్నూలులో స్వైన్ ఫ్లూ అధికంగా ఉంది. యుద్ధప్రాతిపదికన స్పందించాలి. రోగులకు ఊరట కలిగించాలి. పొరుగు రాష్ట్రాల నుంచే స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. సరిహద్దు ప్రాంత జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Related Posts